
126 ఇన్నింగ్స్‌ల్లోనే
స్టీవ్ స్మిత్ 126 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ మైలురాయని సాధించాడు. ప్రస్తుతం పాక్‌తో ఆడుతోన్న టెస్టు స్టీవ్ స్మిత్‌కు 70వ టెస్టు కావడం విశేషం. ఫలితంగా టెస్టుల్లో తక్కువ ఇన్నింగ్స్‌లో అత్యంత వేగంగా 7000 పరుగుల రికార్డుని అందుకున్న ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో హమ్మాండ్ రికార్డును బద్దలు కొట్టాడు.

కోహ్లీ, సచిన్ రికార్డు బద్దలు
ఈ జాబితాలో టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ మూడో స్థానంలో ఉన్నాడు. సెహ్వాగ్ 134 ఇన్నింగ్స్‌ల్లో 7000 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. ఇక, సచిన్ టెండూల్కర్(136) నాలుగో స్థానంలో ఉండగా, విరాట్ కోహ్లీ, కుమార సంగక్కార, గ్యారీ సోబర్స్(138)లు సంయుక్తంగా ఐదో స్థానంలో ఉన్నారు.
టెస్టుల్లో అత్యంత వేగంగా 7000 పరుగులు సాధించిన ఆటగాళ్లు(innings):
126* - Steve Smith (AUS)
131 - Walter Hammond (ENG)
134 - Virender Sehwag (IND)
136 - Sachin Tendulkar (IND)
138 - Garry Sobers (WI)/Kumar Sangakkara (SL)/Virat Kohli (IND)

11వ ఆటగాడి స్మిత్
దీంత పాటు ఆస్ట్రేలియా తరఫున టెస్టుల్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో బ్రాడ్‌మన్‌ను అధిగమించాడు. ఈ మ్యాచ్‌లో స్టీవ్ స్మిత్ 20 పరుగులు చేయడం ద్వారా డాన్ బ్రాడ్‌మన్(6996) రికార్డు కూడా బద్దలైంది. ఇక, ఆస్ట్రేలియా తరఫున 7000 టెస్టు పరుగులు సాధించిన 11వ ఆటగాడి స్మిత్ నిలిచాడు.

బ్రాడ్‌మన్ రికార్డు బద్దలు కొట్టిన స్మిత్
బ్రాడ్‌మన్ 52 టెస్టుల్లో 6,996 పరుగులు చేయగా.. స్మిత్ 69 టెస్టుల్లో 6,977 పరుగులు చేసాడు. ఈ మ్యాచ్‌కి ముందు బ్రాడ్‌మన్‌ను అధిగమించడానికి స్మిత్ కేవలం 20 పరుగుల దూరంలో ఉన్నాడు. ఇప్పుడు బ్రాడ్‌మన్‌ను అధిగమించాడు.

అగ్రస్థానంలో రికీ పాంటింగ్
టెస్ట్ ఫార్మాట్‌లో బ్రాడ్‌మన్ 29 సెంచరీలు చేసాడు. స్మిత్ 26 సెంచరీలు చేసాడు. బ్రాడ్‌మన్ సెంచరీలను అందుకోవడానికి స్మిత్ మూడు సెంచరీల దూరంలో నిలిచాడు. ఆసీస్ తరఫున టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ (13,378) అగ్రస్థానంలో ఉన్నాడు.


Click it and Unblock the Notifications












