Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Champions Trophy Tickets: భారత క్రికెట్ ఫ్యాన్స్‌కు స్పెషల్ సర్‌ప్రైజ్.. అందుబాలోకి ఎక్స్‌ట్రా టికెట్స్

పాకిస్థాన్ వేదికగా మరో మూడు రోజుల్లో ప్రతిష్టాత్మక ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది. అయితే ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా ఆడే మ్యాచ్‌లను చూడాలనుకునే క్రికెట్ అభిమానులకు గుడ్‌న్యూస్. ఈ మ్యాచ్ కోసం ఎక్స్ ట్రా టికెట్లను అందుబాటులో ఉంచింది అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ). ఇప్పటికే ఈ టికెట్లను ఆన్‌లైన్‌లో జారీ చేసినట్లు తెలిపింది ఐసీసీ. ఫిబ్రవరి 16 మధ్యాహ్నం 1.30 గంటల నుంచి టికెట్ల అమ్మకాలను ప్రారంభించింది.

టీమిండియా తలపడేది వీరితోనే..
టీమిండియా ఆడే మూడు గ్రూప్ మ్యాచులకు అదనంగా టికెట్లు అందుబాటులో ఉంచడంతో పాటు తొలి సెమీఫైనల్ కు సంబంధించి పరిమిత టికెట్లు జారీ చేసినట్లు వెల్లడించింది. టీమిండియా తన తొలి మ్యాచ్‌ను ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో పోటీ పడనుది. ఫిబ్రవరి 23న పాకిస్థాన్ తో, మార్చి 2న న్యూజిలాండ్‌తో భారత జట్టు తలపడనుంది. మార్చి 4న తొలి సెమీస్‌ మ్యాచ్ నిర్వహించనున్నారు.

More Tickets Available for TeamIndia s Champions Trophy 2025 Matches in Dubai

తొలి సెమీస్ ముగిశాకే...
మార్చి 9న జరిగే ఫైనల్‌ మ్యాచ్‌ టికెట్లను.. తొలి సెమీస్‌ ముగిశాక విడుదల చేస్తామని తెలిపింది. ఒకవేళ టీమిండియా ఫైనల్‌కు అర్హత సాధిస్తే.. దుబాయ్‌ వేదికగానే తుది పోరు జరగనుంది. లేదంటే లాహోర్‌ వేదికగా టైటిల్ పోరు ఉంటుంది. కాబట్టి ఫైనల్ మ్యాచ్ వేదిక ఫిక్స్ అవ్వాలంటే తొలి సెమీస్ రిజల్ట్ రావాల్సిందే. కాగా, ఛాంపియన్స్ ట్రోఫీ గ్రూప్ Aలో టీమిండియాతో పాటు న్యూజిలాండ్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ ఉన్నాయి. ఫిబ్రవరి 19న ఓపెనింగ్ మ్యాచ్‌ పాకిస్థాన్ - న్యూజిలాండ్‌ జట్ల మధ్య జరగనుంది.

Story first published: Sunday, February 16, 2025, 16:24 [IST]
Other articles published on Feb 16, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+