Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Big Bash League: అశ్విన్ టీంలో చేరాడో లేదో.. అప్పుడే మన్కడింగ్ ట్రై చేసిన స్టార్ స్పిన్నర్

Adam Zampa tries to run out non striker like Ravichandran Ashwin

కొంత మంది ఆటగాళ్లు క్రికెట్ రూల్స్ మారుస్తుంటారు. అలాంటి వాళ్లలో ఒకడే మన రవిచంద్రన్ అశ్విన్. పదునైన బుర్రతో ఎప్పుడూ రూల్ బుక్‌ను ఫాలో అవుతూనే ఎప్పటికప్పుడు ప్రత్యర్థిని చెక్‌లో పెట్టడం అశ్విన్‌కు బాగా అలవాటు. గతంలో ఐపీఎల్‌లో కూడా అతను అదే చేశాడు. ఇంగ్లండ్ స్టార్ జోస్ బట్లర్‌ను నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో రనౌట్ చేశాడు. అది అవుటిచ్చే వరకు వెనక్కు తగ్గలేదు.

 కొత్త రూల్‌ చేసిన ఐసీసీ

కొత్త రూల్‌ చేసిన ఐసీసీ

ఇది జరిగిన కొంత కాలానికి ఐసీసీ దిగొచ్చింది. ఇలా మన్కడింగ్ చేయడాన్ని 'అన్‌ఫెయిర్ ప్లే' నుంచి తొలగించి, రనౌట్ కింద చేర్చింది. దీంతో ఇక ఎవరైనా ఇలా ఎవరినైనా అవుట్ చేయొచ్చనే ధైర్యం ఇచ్చింది. దీన్ని అందిపుచ్చుకున్న టీమిండియా మహిళా క్రికెటర్ దీప్తి శర్మ కూడా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇలాగే చివరి వికెట్ కూల్చింది. అప్పట్లో ఇది పెద్ద వివాదాస్పదమైన సంగతి తెలిసిందే.

మన్కడింగ్ చేయబోయిన జంపా

మన్కడింగ్ చేయబోయిన జంపా

ఇప్పుడు ఆడమ్ జంపా కూడా ఇదే ట్రై చేశాడు. బిగ్ బ్యాష్ లీగ్‌లో రెనగేడ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చివరి ఓవర్లో జంపా బంతి అందుకున్నాడు. ఆ ఓవర్ ఐదో బంతి వేయడానికి ముందుకొచ్చాడు. ఆ సమయంలో నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న బ్యాటర్.. జంపా బంతి విసరక ముందే క్రీజు దాటేశాడు. దాంతో వెంటనే వెనక్కు తిరిగిన జంపా.. వికెట్లను కూల్చి అంపైర్‌కు అప్పీల్ చేసి మళ్లీ బౌలింగ్ చేయడానికి వెళ్లిపోయాడు.

టెక్నికల్‌గా నాటవుట్..

తను అవుటై పోయానని భావించిన సదరు బ్యాటర్ మైదానం వీడబోయాడు. అయితే అంపైర్లు అతన్ని ఆపారు. జంపా బంతిని డెలివరీ చేసే పొజిషన్‌కు వెళ్లాడా? అని చెక్ చేశారు. జంపా బంతి డెలివర్ చేయలేదు కానీ.. ఆ పొజిషన్‌కు వెళ్లే వరకు సదరు బ్యాటర్ క్రీజులోనే ఉన్నాడు. దాంతో అది నాటౌట్ అని థర్డ్ అంపైర్ ప్రకటించాడు. దీంతో ఆ బ్యాటర్ ఊపిరి పీల్చుకున్నాడు. ఇది చూసిన నెటిజన్లు ఊరుకుంటారా? అశ్విన్, జంపా పేర్లతో ట్విట్టర్‌లో తెగ ట్వీట్లు చేస్తున్నారు.

అశ్విన్ దగ్గర నేర్చుకో..

అశ్విన్ దగ్గర నేర్చుకో..

ప్రస్తుతం ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టులో అశ్విన్ ఉన్నాడు. అతని చేతిలో ఇలా నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో అవుటైన జోస్ బట్లర్ కూడా అదే జట్టులో ఉన్నాడు. తాజాగా మినీ వేలంలో ఆడమ్ జంపాను కూడా రాజస్థాన్ జట్టే కొనుగోలు చేసింది. ఇదే విషయాన్ని ఎత్తి చూపుతున్న ఫ్యాన్స్.. వచ్చే ఐపీఎల్‌లో అశ్విన్ దగ్గరుండి మరీ జంపాకు మన్కడింగ్ చేయడం నేర్పిస్తాడని కామెంట్లు చేస్తున్నారు. 'నాన్ స్ట్రైకర్‌ను అవుట్ చేయాలంటే అలాక్కాదు జంపా.. అర్జెంటుగా అశ్విన్ దగ్గర నేర్చుకో' అని సలహాలు ఇస్తున్నారు.

Story first published: Tuesday, January 3, 2023, 17:26 [IST]
Other articles published on Jan 3, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+