Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కలిసి స్నానం చేసే వరకు: జంపా-స్టోయినిస్ రొమాన్స్ తదుపరి లెవెల్‌కు!

Adam Zampa takes his bromance with Marcus Stoinis to another level

హైదరాబాద్: ఇటీవలే షార్జా వేదికగా ఆస్ట్రేలియా-పాకిస్ధాన్ జట్ల మధ్య జరిగిన వన్డేలో ఆడమ్‌ జంపా, మార్కస్‌ స్టోయినీస్‌ ప్రవర్తన చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. రెండో వన్డే సందర్భంగా రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌ చేధనలో ఉన్న సమయంలో ఆ జట్టు ఆటగాళ్లు మార్కస్‌ స్టోయినిస్‌, ఆడమ్ జంపాలు డ్రెస్సింగ్‌రూమ్‌ బాల్కనీలో ఇద్దరూ పక్కపక్కనే కూర్చుని గేలు మాదిరి ప్రవర్తించిన తీరుని యావత్ ప్రపంచం మొత్తం చూసింది.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

ఇదంతా అక్కడి కెమెరాలో రికార్డు అయింది. తొలుత ఆస్ట్రేలియా బౌలర్‌ జంపా.. మార్కస్‌ స్టోయినిస్‌ తలపై చేతి పెట్టి మృదువుగా నిమిరాడు. ఆ తర్వాత మళ్లీ తన చేతితో స్టోయినిస్‌ చెంప, చెవిపై నిమురుతుండగా జంపా చేతిని స్టోయినిస్‌ ముద్దాడినట్లు వీడియోలో కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే.

ఈ ఘటన మరువకముందే వీరిద్దరూ స్నానం చేస్తున్న ఫొటోలను ఆడమ్ జంపా ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టి "మేమిద్దరం చాలా మంచి స్నేహితులం. మీరు దీనిని అనవసరంగా పెద్దదిగా చేయొద్దు" అంటూ కామెంట్ పెట్టాడు. కాగా, పాకిస్థాన్‌తో ఐదు వన్డేల సిరిస్ ముగియడంతో ఆస్ట్రేలియా జట్టులోని ఆటగాళ్లు ఐపీఎల్‌లో ఆడనున్నారు.

ఇందులో భాగంగా మార్కస్ స్టోయినిస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో చేరాడు. బుధవారం సవామ్ మాన్‌సింగ్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌తో జరగనున్న మ్యాచ్‌లో మార్కస్ స్టోయినిస్ ఆడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో "పాపం జంపా.. స్టోయినీస్‌ను మిస్సవుతున్నాడు" అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Story first published: Tuesday, April 2, 2019, 17:58 [IST]
Other articles published on Apr 2, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+