మనం చూసే కోహ్లీ వేరు.. అతను చాలా సరదా మనిషి: ఆడం జంపా

సిడ్నీ: టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీని మైదానంలో చూసే దానికి బయట చూసే దానికి పోలికే ఉండదని ఆస్ట్రేలియా స్పిన్నర్‌ ఆడం జంపా తెలిపాడు. ఇటీవల యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్ 2020 సీజన్‌లో జంపా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) తరఫున ఆడిన సంగతి తెలిసిందే. అయితే, ఈ సీజన్‌లో అతను ఆడింది కేవలం మూడు మ్యాచ్‌లే అయినా కోహ్లీతో ప్రత్యేక అనుబంధం ఏర్పడిందని తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. తాను దుబాయ్‌లో అడుగుపెట్టిన నాటి నుంచి కెప్టెన్‌ కోహ్లీ తనని బాగా చూసుకున్నాడని చెప్పాడు.

ఫస్ట్ డేనే..

ఫస్ట్ డేనే..

'దుబాయ్‌లో అడుగుపెట్టిన తొలి రోజే కోహ్లీ వాట్సాప్‌లో మెసేజ్‌ చేశాడు. అతని నంబర్‌ కూడా నా దగ్గర లేదు. అయినా తామిద్దరం ఎప్పటి నుంచో తెలిసినోడిలా మాట్లాడాడు. ఒక రెస్టారెంట్‌లో ఆఫర్‌ కూపన్‌ పంపించి అక్కడ భోజనం చేయమని చెప్పాడు. ఇకపోతే మైదానంలో కనిపించే కోహ్లీకి బయట ఉండే అతనికి అస్సలు పోలికే లేదు.అతని భావోద్వేగాలన్నీ ఆటకు సంబంధించినంత వరకే ఉంటాయి. ప్రత్యర్థులపై పోటీని మాత్రమే అతను ఆస్వాదిస్తాడు. అందరిలాగే ఓటమంటే నచ్చదు. అయితే, మిగతావారి కంటే కాస్త ఎక్కువగా దాన్ని బయటకు ప్రదర్శిస్తాడు.

 చాలా సరదా మనిషి..

చాలా సరదా మనిషి..

ఒక్కసారి మైదానం దాటాడంటే తర్వాత అందరిలాగే కలిసిపోతాడు. బస్సులో ప్రయాణించేటప్పుడు యూట్యూబ్‌ వీడియోలు చూస్తూ గట్టిగా నవ్వుతాడు. ఒకసారి సరదా రనౌట్‌ చూసి మూడు వారాల పాటు నవ్వుకున్నాడు. సరదా సన్నివేశాలను అంత బాగా ఇష్టపడతాడు. కోహ్లీ చాలా కల్చరల్ గాయ్. సరదాగా మాట్లాడుతూ నవ్విస్తూనే ఉంటాడు. అతని నేపాల్ ప్రయాణం గురించి చెప్పాడు. అతని న్యూ కాఫీ మిషిన్ గురించి వివరించాడు.'అని జంపా పేర్కొన్నాడు.

ఏడు సార్లు ఔట్ చేశా..

ఏడు సార్లు ఔట్ చేశా..

ఇక అంతర్జాతీయ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ వికెట్ తీయడాన్ని తాను ఓ సవాల్‌గా భావిస్తానన్నాడు. ‘ఇప్పటికే విరాట్‌ను ఏడు సార్లు ఔట్ చేశా. కానీ వారు నా బౌలింగ్‌లో బాగానే పరుగులు చేశారు. ఓవర్‌కు 6 పరుగులతో మంచి ఎకానమీ ఉంది. ఇప్పుడు మా మధ్య మంచి ఫ్రెండ్‌షిప్ ఉన్న ఈ పరిస్థితుల్లో కోహ్లీకి బౌలింగ్ చేయడాన్ని ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. విరాట్‌కు బౌలింగ్ చేయడాన్ని ఎప్పడూ ఇష్టపడుతా. అతను అత్యుత్తమ ఆటగాడు. ఇప్పటికే అతను 43 సెంచరీ చేశాడు. విరాట్ ఓ సూపర్ మ్యాన్. అతను బిగ్ వికెట్'అని జంపా చెప్పుకొచ్చాడు.

IPL 2020 రికార్డు వ్యూయర్‌షిప్‌‌కు సెహ్వాగ్ ఒక కారణం: సౌరవ్ గంగూలీ

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
 
Story first published: Sunday, November 22, 2020, 18:57 [IST]
Other articles published on Nov 22, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X