Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్ మధ్యలో అనూహ్య పరిణామం: మ్యాచ్‌లు ఆడలేనని తేల్చేసిన స్టార్ ప్లేయర్

Adam Zampa: ఐపీఎల్ 2024 రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటివరకు 24 మ్యాచ్‌లు ముగిశాయి. మూడు జట్లు మిగిలినవన్నీ కూడా అయిదేసి చొప్పున మ్యాచ్‌లు ఆడాయి. నేడు వాంఖెడే స్టేడియంలో జరగబోయేది 25వ గేమ్. ముంబై ఇండియన్స్‌ను వాళ్ల సొంత గడ్డపై ఢీ కొట్టబోతోంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఈ సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది.

ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది రాజస్థాన్ రాయల్స్. అయిదు మ్యాచ్‌లల్లో నాలుగింట్లో గెలిచింది. మొత్తం ఎనిమిది పాయింట్లతో టాప్‌లో కూర్చుంది. కోల్‌కత నైట్ రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్, చెన్నై సూపర్ కింగ్స్, ఆ తరువాతి స్థానాల్లో నిలిచాయి. ఈ టేబుల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ది అయిదో స్థానం.

Adam Zampa pull out of IPL 2024

ఈ టోర్నమెంట్‌లో వరుస విజయాలతో దూసుకెళ్తోన్న రాజస్థాన్ రాయల్స్‌కు అనూహ్యంగా షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ స్పిన్ బౌలర్ ఆడమ్ జంపా అనూహ్య నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఈ సీజన్ నుంచి తప్పుకొన్నట్లు ప్రకటించాడు. కొంత విశ్రాంతి తీసుకోవాలనకుంటోన్నానని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు.

ఐసీసీ వరల్డ్ కప్ 2023 కోసం గత ఏడాది కాలంగా నిరంతరాయంగా క్రికెట్ ఆడుతూనే వస్తొన్నానని ఆడమ్ జంపా గుర్తు చేశాడు. శరీరం పూర్తిగా అలసిపోయిందని, విశ్రాంతిని కోరుకుంటోందని పేర్కొన్నాడు. పైగా చాలాకాలంగా భారత్‌లోనే ఉంటోన్నాననీ చెప్పాడు. ఈ ఏడాది జరగబోయే ఐసీసీ టీ20 వరల్డ్ కప్ కోసం సన్నద్ధం కావాల్సిన పరిస్థితులు కూడా ఉన్నాయని జంపా తెలిపాడు.

ప్రస్తుతం తనకు ఐపీఎల్ కంటే కూడా ఐసీసీ టీ20 వరల్డ్ కప్ ముఖ్యమని, అందులో ఆడటానికి కొంత విశ్రాంతి అవసరమని భావించానని ఆడమ్ జంపా వివరించాడు. ఈ ఏడాది ఐపీఎల్‌ ఆడకపోవడానికి అనేక కారణాలున్నాయని వివరించాడు. ఈ ఏడాది మళ్లీ ఐపీఎల్ ఆడాలని భావించినప్పటికీ అది సాధ్యపడట్లేదని పేర్కొన్నాడు.

రాజస్థాన్ రాయల్స్‌ సాధించే విజయాల్లో తనవంతు బాధ్యతను నిర్వర్తించలేనని భావిస్తోన్నానని వ్యాఖ్యానించాడు జంపా. అందుకే ఈ సీజన్ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నానని, ఇక ఐసీసీ వరల్డ్ కప్ 2024 కోసం ఎదురు చూస్తున్నానని, తనకు అదే ముఖ్యమైన టోర్నమెంట్ అని స్పష్టం చేశాడు.

Story first published: Thursday, April 11, 2024, 11:51 [IST]
Other articles published on Apr 11, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+