Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆడమ్ జంపా దెబ్బకు కుప్పకూలిన కివీస్.. ఘన విజయంతో సిరీస్ కైవసం చేసుకున్న ఆసీస్

Adam Zampa Five Wickets Haul Helped Australia Win Over Kiwis with Huge Margin in 2nd ODI

ఆడమ్ జంపా వన్డేల్లో తన తొలి 5 వికెట్ల ప్రదర్శనతో చెలరేగడంతో న్యూజిలాండ్‌ 83పరుగులకే ఆలౌట్ అయింది. కెయిర్న్స్‌లో గురువారం జరిగిన రెండో వన్డేలో ఆస్ట్రేలియా న్యూజిలాండ్‌ను 113పరుగుల భారీ తేడాతో ఓడించి.. 3మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో 2-0తో సిరీస్ కైవసం చేసుకుంది. 196పరుగుల లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ ఆదిలోనే మార్టిన్ గప్టిల్‌ (2) వికెట్ కోల్పోయింది. అలాగే కాన్వే (3), టామ్ లాథమ్ (0) కూడా ఎక్కువసేపు ఆడలేకపోయారు.

మూడు వికెట్లు పడటంతో.. కెప్టెన్ కేన్ విలియమ్సన్ కాసేపు డిఫెన్స్ ఆడాడు. మరో ఎండ్‌లో ఉన్న డారిల్ మిచెల్ కూడా పెద్దగా ఆడలేకపోయాడు. కేన్ విలియమ్సన్ 58బంతుల్లో 17 పరుగులు చేసి ఔటయ్యాడు. డారిల్ మిచెల్ (10) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయాడు. క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయి న్యూజిలాండ్ 33ఓవర్లలో 82పరుగులకే ఆలౌట్ అయింది. ఆసీస్ బౌలర్లలో స్టార్క్ 2, సీన్ అబాట్ 2, జంపా 5, స్టాయినిస్ 1 వికెట్ తీశారు. తద్వారా ఆసీస్ 113పరుగుల తేడా గెలుపొందింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా బ్యాటింగ్, బౌలింగ్లో రాణించిన స్టార్క్ ఎంపికయ్యాడు.

 బౌల్ట్, హెన్రీ చెలరేగడంతో

బౌల్ట్, హెన్రీ చెలరేగడంతో

కివీస్‌ ప్రారంభంలోనే మూడు వికెట్లను కోల్పోయాక తీవ్ర ఒత్తిడికి గురైంది. కచ్చితంగా గెలవాల్సిన ఈ మ్యాచ్‌లో ఏమాత్రం ఎటాకింగ్ గేమ్ ఆడకుండా ఆసీస్ బౌలర్ల ప్రతాపం మరింత పెరిగేలా చేశారు. ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్ విజయం కోసం న్యూజిలాండ్ 13ఏళ్లుగా ఎదురుచూస్తోంది. అది మళ్లీ అందని ద్రాక్షగా మారింది. ఇక తొలుత ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేయగా.. న్యూజిలాండ్ బౌలర్లు ట్రెంట్ బౌల్ట్ 4వికెట్లు, మాట్ హెన్రీ 3వికెట్లు చెలరేగారు. దీంతో ఆస్ట్రేలియాను 9వికెట్ల నష్టానికి 195పరుగులకే పరిమితమైంది.

చివర్లో ఆదుకున్న స్టార్క్, హేజిల్‌వుడ్

చివర్లో ఆదుకున్న స్టార్క్, హేజిల్‌వుడ్

ఇక ఆస్ట్రేలియా బ్యాటర్లు తీవ్రంగా నిరాశపరిచారు. డేవిడ్ వార్నర్ (5), అరోన్ ఫించ్ (0), లబుషేన్ (5), స్టాయినిస్ (0), కెరీ (12) నిరాశపరిచారు. అయితే స్టీవ్ స్మిత్ (61పరుగులు 94బంతుల్లో 5ఫోర్లు, 1సిక్సర్) కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టును గట్టెక్కించాడు. 54పరుగులకే 5వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ ఆసీస్‌ను మ్యాక్స్ వెల్ (25)తో కలిసి వంద దాటించాడు. అయితే 117పరుగుల వద్ద తాను ఔటవ్వడంతో ఆసీస్ 130కే ఆలౌట్ అయ్యేలా కన్పించింది. కానీ జోష్ హేజిల్‌వుడ్ 23), మిచెల్ స్టార్క్ (38నాటౌట్) చివరి వికెట్‌కు 47పరుగుల అజేయ భాగస్వామ్యం నమోదు చేశారు. దీంతో స్కోరు 195కు చేరుకుంది.

తుది జట్లు :

తుది జట్లు :

ఆస్ట్రేలియా : డేవిడ్ వార్నర్, ఆరోన్ ఫించ్ (కెప్టెన్ ), స్టీవెన్ స్మిత్, మార్నస్ లాబుషేన్, మార్కస్ స్టోయినిస్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), గ్లెన్ మాక్స్‌వెల్, సీన్ అబాట్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్

న్యూజిలాండ్ : డెవాన్ కాన్వే, కేన్ విలియమ్సన్ (c), టామ్ లాథమ్ (WK), డారిల్ మిచెల్, మైఖేల్ బ్రేస్‌వెల్, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్, మాట్ హెన్రీ, టిమ్ సౌథీ, ట్రెంట్ బౌల్ట్

Story first published: Thursday, September 8, 2022, 20:25 [IST]
Other articles published on Sep 8, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+