జంపా: అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో 50 వికెట్లు తీసిన రెండో స్పిన్నర్

హైదరాబాద్: మొహాలీ వేదికగా ఆదివారం భారత్‌తో జరిగిన నాలుగో వన్డేలో ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆడమ్ జంపా అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. ఆస్ట్రేలియా తరుపున వన్డేల్లో అతి తక్కువ ఇన్నింగ్స్‌లో 50 వికెట్లు తీసిన రెండో స్పిన్నర్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో ఆడమ్ జంపా ఒకే ఒక వికెట్ పడగొట్టాడు.
జట్టు స్కోరు 296 పరుగుల వద్ద కేఎల్ రాహుల్ (26)ని పెవిలియన్‌కు చేర్చాడు. దీంతో వన్డేల్లో 50వ వికెట్‌ని జంపా తన ఖాతాలో వేసుకున్నాడు. తద్వారా అతి తక్కువ మ్యాచ్‌ల్లో 50 వికెట్లు తీసిన స్పిన్నర్ల జాబితాలో జంపా రెండో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో ఆసీస్ స్పిన్ లెజెండ్ షేన్ వార్న్ అగ్రస్థానంలో ఉన్నాడు.

జంపాకు 38 ఇన్నింగ్స్‌లు అవసరం
50వ వికెట్‌ను తీసేందుకు ఆడమ్ జంపాకు 38 ఇన్నింగ్స్‌లు అవసరం కాగా, షేన్ వార్న్ 25 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత సాధించాడు. అతి తక్కువ మ్యాచ్‌ల్లో యాభై వికెట్లు సాధించిన ఆసీస్ స్పిన్నర్ల జాబితాలో షేన్ వార్న్ తర్వాత ఆడమ్ జంపా నిలిచాడు. ఆ తర్వాత స్థానంలో పీటర్ టేలర్(40 మ్యాచ్‌లు), నాథన్ హారిట్జ్(44 మ్యాచ్‌లు), బ్రాడ్ హాగ్(47)లు ఉన్నారు.

వన్డేల్లో అతి తక్కువ మ్యాచ్‌ల్లో 50 వికెట్లు తీసిన ఆసీస్ స్పిన్నర్లు:
25 - షేన్ వార్న్
38 - ఆడమ్ జంపా
40 - పీటర్ టేలర్
44 - నాథన్ హారిట్జ్
47 - బ్రాడ్ హాగ్
నాలుగో వన్డేలో భారత్ ఓటమి
కాగా, నాలుగో వన్డేలో భారత్ ఓటమి పాలైంది. మొహాలి వేదికగా ఆదివారం జరిగిన నాలుగో వన్డేలో 358 పరుగుల భారీ స్కోరు చేసినప్పటికీ.. పేలవ బౌలింగ్, ఫీల్డింగ్ కారణంగా టీమిండియా 4 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. 359 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ ఇంకా 13 బంతులు ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది.

ఐదు వన్డేల సిరీస్ 2-2తో సమం
ఐదు వన్డేల సిరీస్ 2-2తో సమం అయింది. సిరిస్ విజేత ఎవరో నిర్ణయించే ఐదో వన్డే ఢిల్లీ వేదికగా బుధవారం మధ్యాహ్నం 1.30 గంటల నుంచి జరగనుంది. ఆసీస్ ఆటగాడు టర్నర్ (84 నాటౌట్: 43 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సులు)కి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications