Adam Gilchrist : టీ20 ప్రపంచకప్ కోసం ఆసీస్ తుది జట్టులో అతన్ని ఉంచండి.. ప్రత్యర్థి జట్లు వణుకుతాయి

వచ్చే నెల జరగబోయే టీ20ప్రపంచకప్ కోసం ఆస్ట్రేలియా తుది జట్టులో టిమ్ డేవిడ్ కచ్చితంగా ఉండాలని ఆసీస్ మాజీ దిగ్గజాలు ఆడమ్ గిల్‌క్రిస్ట్, మార్క్ వా అభిప్రాయపడ్డారు. భారత్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో ఆస్ట్రేలియా తరఫున డేవిడ్ అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. అతను తొలి టీ20Iలో కీలకమైన నాక్ ఆడాడు. ఆ మ్యాచ్‌లో ఆసీస్ గెలిచింది. మూడో టీ20లోను హాఫ్ సెంచరీ చేశాడు.
ఆసీస్ మూడో టీ20లో ఓడిపోయినప్పటికీ 26ఏళ్ల డేవిడ్ ఇన్నింగ్స్ పట్ల ఆసీస్ మాజీలు, అభిమానుల నుంచి ప్రశంసల జల్లు కురిసింది. ఐసీసీ రివ్యూలో వీరు మాట్లాడుతూ.. ప్రపంచకప్ జట్టులో ఆస్ట్రేలియా తరపున ప్లేయింగ్ ఎలెవన్‌లో డేవిడ్‌కు చోటు కల్పించాలని గిల్‌క్రిస్ట్ అన్నాడు. ఆస్ట్రేలియాకు గతంలో ఇలాంటి బిగ్ హిట్టర్ లేడు. కాబట్టి అతను బ్యాటింగ్‌కు వస్తుంటే ప్రత్యర్థి జట్లు భయపడతాయని చెప్పాడు.

అలాంటి పాత్రను పూరించడానికి సమర్థుడు
'అతని పవర్, అతను బ్యాటింగ్ చేసే విధానం చాలా అబ్బురంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా గత 18నెలలుగా అతని నుంచి ఎలాంటి ప్రదర్శనలు వచ్చాయో మనం చూశాం. భిన్నమైన పరిస్థితుల్లో అతనెలా ఆడాడో ఓ అంచనా ఉంది. అతను బరిలోకి దిగుతుంటే ప్రత్యర్థి జట్లు భయపడతాయి. ఆస్ట్రేలియా జట్టు తరఫున ఇలాంటి పాత్రను పూరించడానికి డేవిడ్ సమర్థుడు. 15 లేదా 20బంతులు ఉన్నప్పుడు టిమ్ డేవిడ్ లాంటి వ్యక్తి ఉంటే.. ఫినిషింగ్ బాగుంటుంది' అని గిల్‌క్రిస్ట్ అన్నాడు. మార్క్ వా కూడా గిల్‌క్రిస్ట్‌తో ఏకీభవించాడు. డేవిడ్ ప్రస్తుతం ప్లేయింగ్ 11లో భాగంగా ఆడాడు. కానీ వార్నర్, మార్ష్, స్టోయినిస్ వస్తే అతని స్థానం పట్ల అనుమానాలున్నాయి. అయితే ఫామ్ ప్రకారం చూసుకుంటే అతన్ని ఆడిస్తేనే బెటర్ అని మార్క్ వా తెలిపాడు.

అతన్ని తీసుకోవడమే తెలివైన నిర్ణయం
ముంబై ఇండియన్స్ మాజీ కోచ్ మహేల జయవర్ధనే కూడా డేవిడ్‌ను ప్రశంసించాడు. అతను ఎక్స్-ఫ్యాక్టర్ ప్లేయర్ అని కితాబిచ్చాడు. 'ఆస్ట్రేలియా చాలా మంచి లైనప్‌ను కలిగి ఉంది. వారికి నెం.6పాత్రలో టిమ్ లాంటి ప్లేయర్ ఉండడం లక్కీ. అతను ఎక్స్-ఫాక్టర్‌ను తీసుకురాగలడు. ఇక చివర్లో ఫినిషింగ్‌కు ఆసీస్‌కు బిగ్ హిట్టర్ అవసరం. కాబట్టి ఆసీస్ ప్లేయింగ్ 11 ఎంపికలో అతన్ని కలిగి ఉండడం తెలివైన నిర్ణయం' అని నేనంటాను.

డేవిడ్, డానియల్ సామ్స్ రాణించడంతో
ఇక మూడో టీ20 మ్యాచ్‌లో ఆసీస్ యువ బ్యాటర్లు కామెరూన్ గ్రీన్ (52పరుగులు 21బంతుల్లో 7ఫోర్లు, 3సిక్సర్లు), టిమ్ డేవిడ్ (54పరుగులు 27బంతుల్లో 2ఫోర్లు, 4సిక్సర్లు) హాఫ్ సెంచరీలతో హడలెత్తించారు. టిమ్ డేవిడ్‌కు తోడుగా చివర్లో డేనియల్ సామ్స్ (28పరుగులు 20బంతుల్లో 1ఫోర్, 2సిక్సర్లు) మంచి సహకారమందించాడు. వీరిద్దరు కలిసి 7వ వికెట్‌కు 68పరుగుల భాగస్వామ్యాన్నిచ్చారు. దీంతో ఆసీస్ స్కోరు 186కు చేరుకుంది. ఇక 187పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా.. 19.5ఓవర్లలో 4వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ (69పరుగులు 36బంతుల్లో 5ఫోర్లు, 5సిక్సర్లు), విరాట్ కోహ్లీ (63పరుగులు 48బంతుల్లో 3ఫోర్లు, 4సిక్సర్లు) హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో పాటు చివర్లో పాండ్యా (25) కీలక ఇన్నింగ్స్ ఆడి విజయలాంఛనాన్ని ముగించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications