
హైదరాబాద్: క్రికెటర్లు జెంటిల్‌మన్‌లా ఉండాలంట. ఎంతలా అంటే నేరుగా కోచ్ వచ్చి తమ కూతురినిచ్చి పెళ్లి చేస్తామనేంత మంచి ప్రవర్తన కలిగి ఉండాలట. ఇలా ఆసీస్ కోచ లాంగర్‌పై సెటైర్ వేస్తూ లెజెండరీ వికెట్ కీపర్ ఆడమ్ గిల్ క్రిస్ట్ చెప్పుకొచ్చాడు. ఆసీస్ టీమ్‌కు కోచ్‌గా వచ్చిన జస్టిన్ లాంగర్ ప్లేయర్స్ వ్యవహార తీరుపై చాలా కఠినంగా ఉంటున్నాడు.
దీనికోసం కొన్ని కఠినమైన నిబంధనలను కూడా అమలు చేస్తున్నాడు.
దాంతో గిల్‌క్రిస్ట్ సరదాగా కొన్ని కామెంట్స్ చేశాడు. ఫాక్స్ స్పోర్ట్స్ నిర్వహించిన బ్యాక్ పేజ్ లైవ్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ప్లేయర్స్ ఎలా ఉండాలంటే కోచ్ లాంగర్ తన కూతుళ్లలో ఒకరిని ఇచ్చి పెళ్లి చేస్తా అనేంతలా ఉండాలి అని తెలిపాడు.
అంతటితో ఆగకుండా .. లాంగరే ఈ కామెంట్ చేసినట్లు గిల్‌క్రిస్ట్ తెలిపాడు. లాంగర్‌కు నలుగురు కూతుళ్లు ఉన్నారని, అతను అదే సెలక్షన్ ప్రక్రియలో ఉన్నాడని గిల్లీ జోక్ చేశాడు. ఇంగ్లాండ్ టూర్‌కు ముందు లాంగర్ టీమ్ కోసం ఓ స్పెషల్ క్యాంప్‌ను ఏర్పాటు చేశాడు. ఆటగాళ్లంతా ఎంతో క్రమశిక్షణగా ఉండాలని, ఆసీస్ ప్లేయర్స్ ఎప్పుడూ ఎంత కష్టపడి ఆడతారో అలాగే ఉండాలన్నదే లాంగర్ ఉద్దేశమని గిల్‌క్రిస్ట్ చెప్పాడు.
బాల్ టాంపరింగ్ నేపథ్యంలో కొత్తగా వచ్చిన లాంగర్ ప్లేయర్స్‌తో కాస్త కఠినంగా వ్యవహరిస్తున్నాడు. బాల్ టాంపరింగ్ ఉదంతం నేపథ్యంలో కోచ్‌గా లీమన్ తప్పుకున్న తర్వాత లాంగర్ కోచ్ బాధ్యతలు చేపట్టాడు.