నా పేరు గిల్లీ.. సిల్లీ కాదు!! నేను ధోనీనే ఎంచుకుంటా‌‌: గిల్‌క్రిస్ట్‌

సిడ్నీ: టీమిండియా మాజీ కెప్టెన్, వికెట్‌ కీపర్‌ ఎంఎస్ ధోనీపై ఆస్ట్రేలియా క్రికెట్‌ దిగ్గజం ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌ ప్రశంసల వర్షం కురిపించాడు. నా పేరు గిల్లీ.. సిల్లీ కాదని, ప్రపంచంలో ఉత్తమ వికెట్‌ కీపర్‌ ధోనీనే అని పేర్కొన్నాడు. ధోనీ ఎదిగిన విధానాన్ని చూసి తాను ఎంతో ఇష్టపడ్డా అని మాజీ వికెట్‌ కీపర్‌ గిల్లీ అన్నాడు. వికెట్‌ కీపర్‌గా గిల్‌క్రిస్ట్‌ ఎన్నో రికార్డులు సాధించాడు‌. వన్డేలో ఓపెనర్‌గా, టెస్టుల్లో 7వ స్థానంలో ఆడుతూ.. ఆసీస్ జట్టుకు విశేష సేవలందించిన గిల్‌క్రిస్ట్‌ ప్రపంచంలో ఉత్తమ వికెట్‌ కీపర్‌గా ఎదిగాడు.

ఉత్తమ కీపర్‌ ధోనీ:

ఉత్తమ కీపర్‌ ధోనీ:

తాజాగా టీవీ ప్రెజెంటర్ మడోన్నా టిక్సేరాతో 'లైవ్ కనెక్ట్' షోలో ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఉత్తమ కీపర్‌ ఎవరు అని మడోన్నా అడగ్గా.. 'ఎంఎస్ ధోనీనే ఎంచుకుంటా. నా పేరు గిల్లీ.. సిల్లీ కాదు. నాకు తెలుసు భారత్‌లో ఎంతో మంది అభిమానులున్న ధోనీ గురించి మాట్లాడుతున్నానని. నా దృష్టిలో ధోనీనే ఎప్పుడూ టాప్‌లో ఉంటాడు. శ్రీలంక నుంచి కుమార సంగక్కర, న్యూజిలాండ్‌ నుంచి మెక్‌కల్లమ్‌, దక్షిణాప్రికా నుంచి మార్క్‌ బౌచర్‌లు ఉత్తమ కీపర్లు. వీరందరిలో భారత మాజీ కెప్టెనే ఉత్తమం. ఆ తర్వాతి స్థానాల్లో సంగక్కర, మెక్‌కల్లమ్‌, బౌచర్‌ ఉంటారు' అని తెలిపాడు.

క్రికెటర్‌గా ఎదగడాన్ని ఎంతో ఇష్టపడ్డా:

క్రికెటర్‌గా ఎదగడాన్ని ఎంతో ఇష్టపడ్డా:

'ఎంఎస్ ధోనీ క్రికెటర్‌గా ఎదగడాన్ని ఎంతో ఇష్టపడ్డా. అతడు ఆడే విధానం, అతడి స్టైల్‌ నన్ను ఎంతో ఆకట్టుకున్నాయి. అభిమానులు అతడిపై పెట్టుకున్న అంచనాలను అందుకుంటూ.. మహీ ఆడిన విధానం ఎంతో ప్రత్యేకం. తనని తాను అదుపులో పెట్టుకునే విధానం అత్యద్భుతం. మిస్టర్‌ కూల్‌గా మైదానంలో, మైదానం బయట ఉండడం చాలా కష్టం. టీమిండియాకు అతడు ఎంతో చేసాడు. భారత క్రికెట్‌పై ధోనీ ప్రభావం దీర్ఘకాలంపాటు ఉంటుంది' అని ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌ పేర్కొన్నాడు.

త్వరలో యూఏఈ పయనం

త్వరలో యూఏఈ పయనం

గతేడాది కాలంగా ఎంఎస్ ధోనీ ఆటకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. యూఏఈ వేదికగా ఐపీఎల్ 2020 సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో అన్ని జట్టు ఆగస్టు 20న యూఏఈ పయనం కానున్నాయి. మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ గత మార్చిలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ నిర్వహించిన శిక్షణా శిబిరంలో సాధన చేశాడు. ప్రాక్టీస్ సమయంలో భారీ సిక్సర్లు కూడా బాదాడు. మహీని చూడడానికి చిదంబరం మైదానంకు భారీ స్థాయిలో అభిమానులు క్యూ కట్టారు. ఆపై వైరస్ కారణంగా రాంచికి వెళ్ళిపోయాడు.

ఏకైక కెప్టెన్

ఏకైక కెప్టెన్

ప్రపంచ క్రికెట్‌లో మూడు ఐసీసీ టైటిల్స్ నెగ్గిన ఏకైక కెప్టెన్ ఎంఎస్ ధోనీ. ఐసీసీ టీ20 ప్రపంచకప్, ఐసీసీ వన్డే ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫీ టేందినియాకు అందించాడు. అంతర్జాతీయ కెరీర్‌లో ఎంఎస్ ధోనీ ఇప్పటివరకు 90 టెస్టుల్లో, 350 వన్డేల్లో, 98 టీ20 మ్యాచ్‌ల్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. టెస్టుల్లో 4876, వన్డేల్లో 10773, టీ20ల్లో 1617 రన్స్ చేశాడు.

అయోధ్య భూమి పూజపై పాక్‌ క్రికెటర్‌ ఏమన్నాడంటే?

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Thursday, August 6, 2020, 14:04 [IST]
Other articles published on Aug 6, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X