
మూడు ఫార్మాట్లలో కోహ్లీ పేలవ ఫామ్
విరాట్ కోహ్లీ ఎడ్జ్‌బాస్టన్లో జరిగిన రీషెడ్యూల్డ్ టెస్టులో కేవలం 11, 20పరుగులు మాత్రమే చేయగలిగాడు. తర్వాత టీ20లలో కూడా చెత్త ప్రదర్శననే కనబరిచాడు. రెండు ఇన్నింగ్స్‌లలో 12పరుగులు మాత్రమే చేయగలిగాడు. వన్డేల్లోనూ రెండు గేమ్‌లలో 17, 16పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ బాట పట్టాడు. ప్రస్తుతం ఏ ఫార్మాట్లోనూ విరాట్ కోహ్లీ రాణించడం లేదు. కెరీర్లోనే అతి దారుణ ఫాంలో అతను ఉన్నాడు. ఇక ఒకప్పుడు సెంచరీల వరద పారించిన కోహ్లీ.. 2019నుంచి ఏ ఫార్మాట్లోనూ సెంచరీ కొట్టలేదు. దీంతో అతని స్థానం విషయంలో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అతన్ని జట్టు నుంచి తప్పించాలని చాలా మంది ఇప్పటికే హాట్ హాట్ కామెంట్లు చేస్తున్నారు.

ప్రస్తుతం హవా చూపించలేకపోవచ్చు కానీ..
ఇకపోతే ఆస్ట్రేలియా దిగ్గజ ప్లేయర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ కోహ్లీ విషయమై స్పందించాడు. విరాట్ కోహ్లీని తప్పించడం టీమిండియాకు ప్రమాదకరమని హెచ్చరించాడు. 'ప్రస్తుతం కోహ్లీని తప్పించడం ప్రమాదకరం. అతను బహుశా ప్రస్తుతం తన హవా చూపించలేకపోవచ్చు. కానీ అతనికి అపారమైన అనుభవం, స్కిల్ ఉంది. అతను చాలా కాలంగా భారత క్రికెట్లో ఉన్నత ప్రమాణాలను నెలకొల్పాడు. అయినప్పటికీ కొందరు అతనికి వ్యతిరేకంగా తీర్పు ఇస్తున్నారు' అని గిల్‌క్రిస్ట్ ముంబై క్రికెట్ అసోసియేషన్ యొక్క బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ ఇండోర్ అకాడమీలో విలేకరులతో తెలిపాడు.

విజేత ఎవరో చెప్పలేను కానీ..
ఇకపోతే టీ20 ప్రపంచకప్ టోర్నీ విషయంలో భారత్ ఏ స్థానంలో నిలుస్తుందనే విషయాన్ని కూడా గిల్లీ చెప్పాడు. 'టీమిండియా ప్రతిభావంతులైన ఆటగాళ్లతో నిండి ఉంది. ప్రస్తుతం తమ తుది ప్లేయింగ్ 11 లేకున్నా ఆ జట్టులో అపారమైన ట్యాలెంటెడ్ ప్లేయర్లు ఉండి ఇటీవల జరుగుతున్న సిరీస్లలో గొప్ప ఫలితాలను సాధిస్తున్నారు. టీమిండియా మేనేజ్ మెంట్ తమ జట్టును విస్తృతం చేస్తోంది. అంతర్జాతీయ అనుభవాన్ని యంగ్ టాలెంటెడ్ ప్లేయర్లకు ఇప్పటి నుంచే అందిస్తోంది. కాబట్టి ఇండియాకు సమీప భవిష్యత్తు బాగుంటుంది. ఇక టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాను తన సొంతగడ్డపై ఓడించడం అత్యంత కష్టం. నేను ఎవరూ గెలుస్తారో ఇప్పుడే చెప్పలేను కానీ ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, పాకిస్థాన్, ఇండియా మొదటి నాలుగు స్థానాల్లో నిలుస్తాయని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను' అని గిల్లీ పేర్కొన్నాడు.


Click it and Unblock the Notifications












