'విదేశాల్లో చెప్పలేం కానీ.. భారత్‌లో టెస్టు ఓపెనర్‌గా రోహిత్ శర్మ రాణిస్తాడు'

హైదరాబాద్: టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ వరల్డ్ క్లాస్ ప్లేయర్ అని ఆస్ట్రేలియా మాజీ క్రికెట్ దిగ్గజం ఆడమ్ గిల్‌క్రిస్ట్ అన్నాడు. దక్షిణాఫ్రికాతో మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌కు గురువారం సెలక్టర్లు జట్టుని ప్రకటించిన సంగతి తెలిసిందే. విండిస్ పర్యటనలో ఘోరంగా విఫలమైన రాహుల్‌ను తప్పించి అతడి స్థానంలో సెలక్టర్లు యువ క్రికెటర్ శుభమాన్ గిల్‌కు చోటు కల్పించారు.
మరోవైపు రోహిత్ శర్మను తిరిగి టెస్టులకు ఎంపిక చేశారు. దీంతో మయాంక్ అగర్వాల్‌తో కలిసి ఓపెనర్‌గా రోహిత్ శర్మ ఇన్నింగ్స్‌ను ప్రారంభించనున్నాడు. ఈ నేపథ్యంలో సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో జరగనున్న మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో రోహిత్ శర్మ ఓపెనర్‌గా అద్భుత ప్రదర్శన చేస్తాడని గిల్‌క్రిస్ట్ విశ్వాసం వ్యక్తం చేశాడు.

గిల్ క్రిస్ట్ మాట్లాడుతూ
ఈ సందర్భంగా గిల్ క్రిస్ట్ మాట్లాడుతూ "ఐపీఎల్‌లో రోహిత్ శర్మతో కలిసి ఆడాను. చూసేవారికి టెస్టుల కోసం రోహిత్ పెద్దగా శ్రమించట్లేదేమో అనిపిస్తుంది. కానీ, రోహిత్ ప్రపంచ స్థాయి ఆటగాడు. అతడు టాపార్డర్‌లో సవాల్ స్వీకరించాలనుకుంటే, అది పనిచేయకపోవడానికి ఎటువంటి కారణం లేదు" అని పేర్కొన్నాడు.

విదేశీ పర్యటనల్లో
"విదేశీ పర్యటనల్లో అతడి బ్యాటింగ్ విధానాన్ని మార్చుకోవాల్సి ఉంది. అయితే, సొంతగడ్డపై మాత్రం టెస్టుల్లో రోహిత్ ఓపెనర్‌గా కచ్చితంగా రాణిస్తాడు. ఇది అతనికి చక్కగా సరిపోతుంది. ఎవరూ అతడిని బలవంతం చేయకూడదు. ఏ ఫార్మాట్‌లోనైనా అభిమానులను ఆకట్టుకోగలడు" అని ఆడమ్ గిల్‌క్రిస్ట్ అన్నాడు.

దక్కన్ చార్జర్స్ జట్టు తరఫున
కాగా, ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ఆరంభ సీజన్‌లో దక్కన్ చార్జర్స్ జట్టు తరఫున వీరిద్దరూ ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే. భారత పర్యటనలో భాగంగా సఫారీ జట్టు 3 టీ20లు, 3 వన్డేల సిరిస్ ఆడనుంది. తొలుత మూడు టీ20ల సిరిస్ జరుగుతుండగా.. ఆ తర్వాత అక్టోబర్ 2 నుంచి మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ ప్రారంభం కానుంది.

విశాఖపట్నంలో తొలి టెస్టు
టీ20 సిరిస్‌కు ధర్మశాల, మొహాలి(సెప్టెంబర్ 18), బెంగళూరు(సెప్టెంబర్ 22) వేదికలు ఆతిథ్యమిస్తున్నాయి. మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో తొలి టెస్టుకు విశాఖపట్నం(అక్టోబర్ 2-6) ఆతిథ్యమిస్తోంది. ఆ తర్వాత పుణె(అక్టోబర్ 10-14), రాంచీ(అక్టోబర్ 19-23) వేదికలు ఆతిథ్యమిస్తున్నాయి.

టెస్టు మ్యాచ్ షెడ్యూల్
విశాఖఫట్నం: October 2-6, 9:30 AM IST
పూణె: October 10-14, 9:30 AM IST
రాంచీ: October 19-23, 9:30 AM IST

దక్షిణాఫ్రికాతో టెస్టు సిరిస్‌కు టీమిండియా:
విరాట్ కోహ్లి(కెప్టెన్), అజింక్య రహానే (వైస్‌కెప్టెన్) రోహిత్ శర్మ, వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), ఛటేశ్వర్ పుజారా, హనుమ విహారి, మయాంక్ అగర్వాల్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, రిషబ్ పంత్, మహ్మద్ షమి, జస్ప్రీత్ బుమ్రా, ఇషాంత్ శర్మ, శుభ్‌మన్ గిల్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications