Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

చిట్టి తమ్ముడా.. ఐపీఎల్‌లో నా సపోర్ట్ ఆ జట్టుకే! : ఊర్వశి రౌతేలా

బాలీవుడ్‌ నటి ఊర్వశి రౌతేలా - టీమిండియా స్టార్ ప్లేయర్‌ రిషభ్ పంత్ మరోసారి హాట్ టాపిక్‌గా మారారు. గతంలో వీరిద్దరు డేటింగ్‌ చేసినట్లు వార్తలు గుప్పుమన్న సంగతి తెలిసిందే. పైగా ఈ ఇద్దరి మధ్య చాలా కాలంగా సోషల్‌ మీడియాలో కోల్డ్ వార్‌ జరుగుతోంది. వీరిద్దరు తరచుగా చాలా సార్లు సోషల్ మీడియా వేదికగా ఒకరిపై మరొకరు సెటైర్లు కూడా వేసుకున్నారు. ముఖ్యంగా ఊర్వశి రౌతేలా.. పంత్‌పై నెగటివ్‌గా ఏదో ఒక కామెంట్ చేస్తూనే ఉంటుంది. అయితే ఈ సారి మాత్రం పంత్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది ఊర్వశి రౌతేలా.

నా సపోర్ట్ దానికే..
ఐపీఎల్‌లో లక్నో సూపర్ జెయింట్స్ గెలవాలని తాను ఆశిస్తున్నట్లు చెప్పింది ఊర్వశి రౌతేలా. లక్నో జట్టుకే తమ మద్దతు అని తెలిపింది. లక్నోతో పాటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు కూడా తన సపోర్ట్ ఉంటుందని వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఎందుకంటే లక్నో జట్టుకు సారథిగా ఉన్నది పంత్ కాబట్టి. కానీ ప్రస్తుతం లక్నో జట్టు ఆశించిన స్థాయిలో ఆడట్లేదు. ఆడిన నాలుగు మ్యాచుల్లో రెండింటిలో మాత్రమే గెలిచింది. అది కూడా కష్టంగానే! దీంతో పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో నిలిచింది. పైగా పంత్ ఆడిన నాలుగు మ్యాచుల్లోనూ విఫలమయ్యాడు. అస్సలు పరుగులేమీ చేయట్లేదు. దీంతో తీవ్రంగా విమర్శలకు గురౌతున్నాడు. అతడికి పెట్టిన రూ.27 కోట్లు వేస్ట్ అని పలువురు కామెంట్లు చేస్తున్నారు.

పంత్‌తో కలిసి పనిచేయాలని ఉందని తన మనసులోని మాటను బయట పెట్టింది ఊర్వశి రౌతేలా! తాజాగా ఆమె తన కొత్త సినిమా 'జాట్' ప్రమోషన్స్‌లో పాల్గొంది. అందులో యాంకర్.. 'పంత్‌తో యాడ్ చేయడం ఇష్టమేనా?' అని అడగగా.. "నేను చాలా మంది క్రికెటర్లతో పనిచేశాను. సూర్యకుమార్ సహా ఇతర ఆటగాళ్లతో వర్క్ చేశాను. కానీ రిషభ్ పంత్ తో చేయలేదు. అతడితో పనిచేస్తానో లేదో తెలీదు. అది స్క్రిప్ట్‌పై ఆధారపడి ఉంటుంది." అంటూ సిగ్గు పడుతూ సమధానమిచ్చింది. దీంతో మళ్లీ పంత్ - ఊర్వశీ సోషల్ మీడియాలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారారు.

Actress Urvashi Rautela Supports Rishabh Pant LSG and RCB in IPL 2025

చిట్టి తమ్ముడూ..
గతంలో ఊర్వశి రౌతేలా - రిషభ్ పంత్‌ డేటింగ్ లో ఉన్నారని వార్తలు జోరుగా రాగా.. వాటిని పంత్ కొట్టిపారేశాడు. అలానే ఊర్వశి కూడా మిస్టర్‌ ఆర్‌పీ అంటూ అతడిపై సెటైరికల్ గా వ్యాఖ్యలు చేసింది. పంత్ తన కోసం ఓ హోటల్ లో వెయిట్ చేశాడని పేర్కొంది. దీనికి.. 'కొందరు పాపులారిటీ కోసం ఎన్ని అబద్ధాలైనా చెబుతారు. దేవుడు వాళ్లని చల్లగా చూడాలి. దయచేసి నన్ను వదిలేయండి' అంటూ పంత్ ఇన్‌స్టాలో పోస్ట్‌ చేశాడు. మళ్లీ దీనికి కౌంటర్‌ ఇచ్చింది ఊర్వశి. 'బ్యాట్‌ బాల్‌తో ఆడుకో చిట్టి తమ్ముడూ. రాఖీ శుభాకాంక్షలు' అంటూ రిప్లై ఇచ్చింది.

Story first published: Monday, April 7, 2025, 10:26 [IST]
Other articles published on Apr 7, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+