Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నటి శ్రియా, వెస్టిండిస్ క్రికెటర్ బ్రావోతో డేటింగ్‌లో ఉందా?

ముంబై: తెలుగు, తమిళ, మళయాళం, కన్నడ సినిమాల్లో పలు అద్భుతమైన పాత్రలు పోషించిన నటి శ్రియా శరణ్ వెస్టిండిస్ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రావోతో లవ్‌లో పడిందంటూ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ముంబై శివార్లలోని ఓ రెస్టారెంట్‌కు వీరిద్దరూ తరచుగా వెళ్తుంటారని తెలుస్తోంది.

ఈ మధ్య కాలంలో వీరిద్దరూ కలిసి ఆ రెస్టారెంట్ నుంచి బయటకు వస్తున్న ఫోటో ఒకటి మీడియాకు చిక్కింది. ఇంకేముంది నటి శ్రియా.. బ్రావాతో ప్రేమలో ఉంటారంటూ బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. ఈ ఫోటో కూడా వారిద్దరూ ప్రేమలో ఉన్నారనే వార్తలకు మరింత బలం చేకూరింది.

అది నిజమో, కాదో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. కాగా, 15 సంవత్సరాల క్రితం సినిమా కెరీర్‌ను ప్రారంభించిన పలు కీలక పాత్రల్లో శ్రియా ప్రేక్షకులను మెప్పించింది. కెరీర్ ప్రారంభించినప్పుడు ఎలా ఉందో, అదే గ్లామర్‌ను ఇప్పుడూ అదే గ్లామర్‌తో ప్రేక్షకులను అలరిస్తోంది.

Actress Shriya Saran spotted with Cricketer Bravo at a Restaurant in Mumbai

అంతేకాదు తన సినిమా కెరీర్‌లో ఎవరితోనూ ఎఫైర్‌లు, బ్రేకప్‌లు లేకుండానే గడిపేసింది. ఈ క్రమంలో ఇన్నాళ్లకు వెస్టిండిస్ క్రికెటర్ బ్రావో ప్రేమలో పడిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక బ్రావో విషయానికి వస్తే విండీస్‌ క్రికెటర్‌ అయినప్పటికీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో భారతీయులకు బాగా సుపరిచితం.

భారతదేశం అన్నా బ్రావోకు ఎంతో ఇష్టం. ఐపీఎల్‌తోపాటు బాలీవుడ్‌ సినిమాల్లో నటిస్తూ, పాటలు పాడుతూ, ఓ హిందీ రియాల్టీ షోలో పాల్గొంటూ భారత్‌తో తన అనుబంధాన్ని కొనసాగిస్తుండటం విశేషం.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+