Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సానియా 'ఇజాన్'ను ఎప్ప‌టికి నా ద‌గ్గ‌రే ఉంచుకోనా: ప‌రిణితీ చోప్రా

Actress Parineeti Chopra Cute Pic with Sania Mirzas Son

నీ కుమారుడిని ఎప్ప‌టికి నా ద‌గ్గ‌రే ఉంచుకోనా అని బాలీవుడ్ అందాల భామ ప‌రిణితీ చోప్రా టెన్నిస్ స్టార్ సానియా మీర్జాను అడుగుతోంది. సినిమా చిత్రీక‌ర‌ణలో భాగంగా ప‌రిణితీ చోప్రా దుబాయ్ పర్యటనలో ఉంది. ప్రస్తుతం అమ్మతనాన్ని ఆస్వాదిస్తున్న సానియా మీర్జా కూడా విహార యాత్ర‌కు దుబాయ్ వెళ్ళింది. అక్కడే సానియా మీర్జా తన బెస్ట్ ఫ్రెండ్ ప‌రిణితీ చోప్రాని క‌లిసింది.

నా ద‌గ్గ‌రే ఉంచుకోనా
ప‌రిణితీ.. సానియా మీర్జా కుమారుడు ఇజాన్‌ని ఒళ్ళో కూర్చో పెట్టుకొని ఫొటో దిగి తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. అంతేకాదు ఆ ఫోటోకి ఓ కాప్షన్ కూడా పెట్టింది. 'ఇప్పుడు పిన్నిని అయ్యాను. ఇజాన్‌ని చూస్తుంటే తినాలనిపిస్తోంది.. కాని వాడే నా చేతిని కొరుకుతున్నాడు. సానియా నీ కుమారుడిని ఎప్ప‌టికి నా ద‌గ్గ‌రే ఉంచుకోనా' అని క్యాప్ష‌న్ పెట్టింది. ప్ర‌స్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైర‌ల్ అయింది.

2010 ఏప్రిల్ 12న సానియా మీర్జా పాకిస్థాన్ క్రికెటర్ షోయ‌బ్ మాలిక్‌ని వివాహం చేసుకుంది. గ‌త ఏడాది అక్టోబ‌ర్‌ 30న మాలిక్‌, సానియా దంపతులకి ఇజాన్ జ‌న్మించాడు. సానియా గత కొంతకాలంగా టెన్నిస్‌కి దూరంగా ఉంది. 2020 ఒలింపిక్స్‌తో మళ్లీ టెన్నిస్ రాకెట్ పడుతానని తాజాగా వెల్లడించారు. మరోవైపు మాలిక్ ఆసీస్ పర్యటనలో బిజీగా ఉన్నాడు. ఐదు వన్డేల సిరీస్‌లో మొదటి మూడు వన్డేలలో 11, 60, 31 పరుగులు చేసాడు. చివరి రెండు మ్యాచులు మాలిక్ ఆడలేదు.

Story first published: Tuesday, April 2, 2019, 13:37 [IST]
Other articles published on Apr 2, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+