Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సూర్యకుమార్ యాదవ్ నాకు మెసేజ్‌లు చేసేవాడు: టాలీవుడ్ హీరోయిన్

ప్రముఖ నటి, మోడల్ ఖుషీ ముఖర్జీ మరోసారి వార్తల్లో నిలిచారు. టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ గురించి ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. సూర్యకుమార్ యాదవ్ గతంలో తనకు తరచుగా మెసేజ్‌లు చేసేవాడని ఖుషీ ముఖర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

సూర్యకుమార్ యాదవ్‌పై ఖుషీ ముఖర్జీ ఏమన్నారంటే?
ఓ ఇంటర్వ్యూలో ఖుషీ ముఖర్జీ మాట్లాడుతూ.. క్రికెటర్లతో తనకున్న పరిచయాల గురించి మాట్లాడారు. "చాలా మంది క్రికెటర్లు నా వెంటపడ్డారు. అందులో సూర్యకుమార్ యాదవ్ కూడా ఒకరు. ఆయన నాకు చాలా మెసేజ్‌లు పంపేవారు." అని ఖుషీ ముఖర్జీ పేర్కొన్నారు. ప్రస్తుతం సూర్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని.. ఇప్పుడు మాట్లాడుకోవడం లేదని ఆమె స్పష్టం చేశారు. తనకు ఎవరితోనూ పేరు ముడిపడటం ఇష్టం లేదని.. అందుకే ఈ విషయాలపై తాను ఆసక్తి చూపడం లేదని ఆమె వెల్లడించారు.

Actress Khushi Mukherjee Claims Suryakumar Yadav Used to Message Her

ఎవరీ ఖుషీ ముఖర్జీ?
కోల్‌కతాకు చెందిన ఖుషీ ముఖర్జీ దక్షిణాది సినిమాలతో పాటు హిందీ బుల్లితెరపై కూడా సుపరిచితురాలే. 2013లో 'అంజల్ తురై' అనే తమిళ చిత్రంతో కెరీర్ ప్రారంభించారు. తెలుగులో 'దొంగ ప్రేమ', 'హార్ట్ ఎటాక్' వంటి చిత్రాల్లో నటించారు. ఎం టీవీ 'స్ప్లిట్స్‌విల్లా 10', 'లవ్ స్కూల్ 3' వంటి షోల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.'బాల్వీర్ రిటర్న్స్'లో జ్వాలా పరిగా, 'కహత్ హనుమాన్ జై శ్రీరామ్' వంటి పౌరాణిక సీరియల్స్‌లోనూ నటించారు. ఖుషీ ముఖర్జీ తరచుగా తన బోల్డ్ ఫ్యాషన్ ఛాయిస్, వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తుంటారు. అయితే ఈ ఆరోపణలపై సూర్యకుమార్ యాదవ్ వైపు నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందన రాలేదు.

Story first published: Tuesday, December 30, 2025, 10:30 [IST]
Other articles published on Dec 30, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+