ముంబై: క్రికెట్ ఆడటం కంటే నటించడమే చాలా కష్టంగా ఉందని క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అభిప్రాయపడ్డాడు. 'సచిన్' మూవీ టీజర్‌ను గురువారం విడుదల చేసిన అనంతరం సచిన్ టెండూల్కర్ మీడియాతో మాట్లాడాడు.
' నాకు క్రికెట్‌ను ఆడటం కంటే నటించడమే ఒక ఛాలెంజ్ అనిపించింది. సినిమా సందర్భంగా నేను ఏది చేయాలనుకున్నానో అది చేశా. కానీ కొన్ని ప్రత్యేకమైన సీన్లలో చాలా ఇబ్బంది పడ్డా' అని సచిన్ టెండూల్కర్ పేర్కొన్నాడు.
'నా డ్రీమ్‌లో భాగమైన యాక్టింగ్ కంటే క్రికెట్ ఆడటమే సులువుగా అనిపించింది. క్రికెట్‌ను ఎంజాయ్ చేస్తూ ఆడా. ఈ రెండింటిని పోల్చి చూస్తే మాత్రం నాకు నటించడమే సవాల్‌గా అనిపించింది. ఇందులో ఎటువంటి సందేహం లేదు' అని సచిన్ తెలిపాడు.

తన చిత్రం గురించి 'తన ప్రయాణం మద్దతుగా నిలిచిన వారందరికీ ప్రత్యేక అభినందనలు. టీజర్ వస్తోంది.' అని ట్విట్టర్‌లో సచిన్ వ్యాఖ్యానించాడు.
ప్రస్తుతం సచిన్ టెండూల్కర్ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ముంబై జట్టుకు మెంటర్ గా వ్యవహరిస్తున్నాడు.
కాగా, సచిన్ టెండూల్కర్ క్రికెట్ జీవిత చరిత్రను 'సచిన్ ఏ బిలియన్ డ్రీమ్స్' పేరుతో జేమ్స్ ఎర్సికిన్ తెరకెక్కించారు. రవి భగ్చంద్క, కార్నివాల్ మోషన్ పిక్చర్స్ నిర్మాతలుగా వ్యవహరించారు. ఏప్రిల్ 11న చిత్రానికి సంబంధించిన తొలి పోస్టర్ విడులైంది. '55 రోజుల శిక్షణ. ఒక జంట ప్యాంట్లు. ది సచిన్ స్టోరీ' అనే క్యాప్షన్‌తో విడుదల చేశారు. సచిన్‌పై సినిమా కావడంతో భారీ అంచాలున్నాయి.