Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మరుపురాని ఏడాది: సంతోషం, విన్నింగ్ సింబల్‌తో కోహ్లీ

హైదరాబాద్: ఐదు టెస్టుల మ్యాచ్ సిరిస్‌ను 4-0తో టీమిండియా కైవసం చేసుకోవడంపై కెప్టెన్ కోహ్లీ సంతోషాన్ని వ్యక్తం చేశాడు. చెన్నై టెస్టు విజయం తర్వాత కోహ్లీ మీడియాతో మాట్లాడాడు. ఇది ఆరంభం మాత్రమేనని సాధించాల్సింది ఇంకా చాలా ఉందని చెప్పాడు. 2016 అద్భుతంగా సాగిందని చెప్పాడు.

కెప్టెన్‌గా కోహ్లీ అరుదైన ఘనత: అజారుద్దీన్ రికార్డు సమం

ఆస్ట్రేలియాలో వన్డే సిరీస్, టీ20 ప్రపంచకప్‌లో ఓటమి తర్వాత మా జట్టు బాగా పరిణతి చెందిందని చెప్పాడు. ఆ తర్వాత జరిగిన ప్రతి సిరీస్‌ను గెలిచామని, మొత్తానికి ఈ ఏడాది మధురమైన జ్ఞాపకంగా మిగిలిపోతుందని అన్నాడు. జట్టు సమిష్టి కృషికి ఇది నిదర్శనం. ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టెస్టులో కాస్త ఒత్తిడిని ఎదుర్కొన్నామని చెప్పాడు.

ఇంగ్లాండ్‌పై భారత ప్రదర్శన సంతృప్తినిచ్చింది

ఇంగ్లాండ్‌పై భారత ప్రదర్శన సంతృప్తినిచ్చింది

మిగతా నాలుగు టెస్టుల్లో టాస్ ఓడినప్పటికీ మూడు మ్యాచ్‌ల్లో నెగ్గామని, జట్టు ప్రదర్శన చాలా సంతృప్తినిచ్చిందని చెప్పాడు. ఇంతకుమించి తానేమీ ఆశించనని చెప్పాడు. నిజానికి 3-0తో సిరీస్‌ను గెలుచుకున్నప్పటికీ ఈ స్థాయిలో విజయం సాధించడమంటే మాటలు కాదన్నాడు.

భారత లోయర్ ఆర్డర్ అద్భుతంగా ఆడింది

భారత లోయర్ ఆర్డర్ అద్భుతంగా ఆడింది

ఇది జట్టు వ్యక్తిత్వానికి నిబద్ధతకు నిదర్శనమని చెప్పాడు. దేశం కోసం ఆడేందుకు ఆటగాళ్లు ఎంతగా సన్నద్ధమయ్యోరో ఇది చాటుతోందని కోహ్లీ తెలిపాడు. ముఖ్యంగా భారత లోయర్ ఆర్డర్ అద్భుతంగా అడిందన్నాడు. మొదటి రెండు టెస్టుల్లో అంతగా ఆడకపోయినా చెన్నై టెస్టులో రాహుల్‌, కరుణ్‌ నాయర్‌ అద్భుతంగా రాణించారని కితాబిచ్చాడు.

ఎవరికీ అందనంత ఎత్తులో

ఎవరికీ అందనంత ఎత్తులో

ఇలాగే ఆడితే టీమిండియా ఎవరికీ అందనంత ఎత్తులో నిలుస్తుందని చెప్పాడు. భారత జట్టులో చోటు ఆశించే ప్రతి క్రికెటర్‌.. ముందుగా జట్టు ప్రమాణాలను అందుకోవాలన్నాడు. కరుణ్‌ నాయర్‌ ప్రదర్శన చూస్తే.. రాబోయే తరం ఎంత స్మార్ట్‌గా ఉందో అర్థమవుతుందని కోహ్లీ చెప్పాడు. అశ్విన్‌ నీడన మిగతా బౌలర్లు ఆడుతున్నారనే వాదనతో కోహ్లీ విభేదించాడు.

అంచనాలకు మించి రాణించాం

అంచనాలకు మించి రాణించాం

మొత్తంగా చూస్తే ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు సిరిస్‌లో టీమిండియా అంచనాలకు మించిందనే చెప్పాలి. చెన్నైలో జరిగిన చివరి టెస్టులో కోహ్లీ సేన ఇంగ్లాండ్‌పై 75 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇంగ్లాండ్‌పై గతంలో లేనటువంటి అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది.

ఇది వరుసగా 18 విజయం

ఇది వరుసగా 18 విజయం

2012 టెస్టు సిరిస్ ఓటమికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. 1999 తర్వాత వరుసగా రెండు టెస్టుల్లో ఇన్నింగ్స్ విజయాలను భారత్ కైవసం చేసుకుంది. టెస్టుల్లో భారత్‌కు ఇది వరుసగా 18 విజయం కావడం విశేషం కాగా, మరొకవైపు 2015 నుంచి వరుసగా ఐదో టెస్టు సిరీస్ విజయం.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+