
హైదరాబాద్: ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌కు గురువారం ప్రారంభమైంది. ఐదు టెస్టుల యాషెస్ సిరీస్‌లో భాగంగా తొలి టెస్టుకు చారిత్రక గబ్బా మైదానం ఆతిథ్యమిస్తోంది. ఈ టెస్టులో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు కెప్టెన్ జోరూట్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
ఇదిలా ఉంటే యాషెస్ సిరిస్ నేపథ్యంలో జట్టులోని సహచర ఆటగాళ్లకు ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ ట్విట్టర్ వేదికగా తన విషెస్ తెలియజేశాడు. గత సెప్టెంబర్ నెలలో బ్రిస్టల్‌లో ఓ నైట్ క్లబ్‌లో జరిగిన గొడవలో భాగంగా బెన్ స్టోక్స్ అరెస్టు కావడం ఆ తర్వాత విడుదలైన సంగతి తెలిసిందే.
ఈ కేసు నిమిత్తం బెన్ స్టోక్స్ విచారణను ఎదుర్కొంటున్న నేపథ్యంలో అతడిని ఇంగ్లాండ్ & వేల్స్ క్రికెట్ బోర్డు యాషెస్ టెస్టు సిరిస్‌కు ఎంపిక చేయలేదు. ఈ యాషెస్ సిరిస్‌లో స్టోక్స్ బరిలోకి దిగకపోవడం ఇప్పటికే పెద్ద టాపిక్ అయింది. అయితే చివరి రెండు టెస్టులకు స్టోక్స్ అందుబాటులో ఉంటాడనే వార్తలు కూడా ఉన్నాయి.
గబ్బా టెస్టు నేపథ్యంలో 26 బెన్ స్టోక్స్ జట్టులోని తన సహచర ఆటగాళ్లకు గుడ్ లక్ విషెస్ చెప్పాడు. ఇందుకు సంబంధించిన వీడియోని తన ట్విట్టర్‌లో పోస్టు చేశాడు. ఇంటి నుంచే తాను ఈ మ్యాచ్‌ని వీక్షించనున్నట్లు అందులో పేర్కొన్నాడు.
'తొలి టెస్టులో మీరంతగా బాగా ఆడాలని కోరకుంటున్నా. కోచ్‌లకు బ్యాక్ రూమ్ స్టాఫ్‌కు నా విషెస్ తెలియజేస్తున్నా. ఈ సిరిస్ కోసం మీరేంతగా సిధ్దమయ్యారో తెలుస్తుంది. ఈ సిరిస్ కోసం ఎంతోదూరం ప్రయాణం చేసిన అభిమానులకు కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా' అని బెన్ స్టోక్స్ తెలిపాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.