Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

యువీ వంతు వచ్చేసింది : బాలీవుడ్ లో యువరాజ్ బయోపిక్

ముంబై : బాలీవుడ్ లో బయోపిక్ ల ట్రెండ్ సిల్వర్ స్క్రీన్ ను ఊపేస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్లు అజారుద్దీన్, ధోనిల బయోపిక్ లు వెండితెర మీద తళుక్కుమనగా.. సచిన్ బయోపిక్ క్యూలో ఉంది. ఇదిలా ఉండగానే ఇప్పుడు మరో క్రికెటర్ బయోపిక్ కూడా సిల్వర్ స్క్రీన్ పైకి ఎక్కే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.

తాజాగా బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ చేసిన కామెంట్స్ ఇందుకు నిదర్శనం. బాలీవుడ్ లో నడుస్తోన్న బయోపిక్ ల ట్రెండ్ పై స్పందించిన బచ్చన్.. వ్యక్తిగతంగా తనకు యువరాజ్ సింగ్ జీవితకథ పట్ల ఆసక్తి ఏర్పడిందని చెప్పాడు. యువీ లైఫ్ లో ఎన్నో ఒడిదుడుకులు ఉన్నాయని, వాటన్నింటిని సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరిస్తే ఆదర్శప్రాయంగా ఉంటుందని చెప్పుకొచ్చాడు.

Abhishek wants to do YUVARAJs biopic in bollywood

అంతేకాదు.. యువీ బయోపిక్ నిర్మించడం కోసం ఎవరైనా దర్శక నిర్మాతలు ముందుకొస్తే.. యువీ పాత్రలో తాను నటించడానికి సై అన్నాడు అభిషేక్ బచ్చన్. ఇకపోతే ఒకానొక దశలో క్యాన్సర్ బారిన పడి.. యువీ కెరీర్ తీవ్ర సందిగ్ధంలో పడినా.. క్యాన్సర్ ను విజయవంతంగా జయించి.. కెరీర్ ను కూడా యువీ మళ్లీ గాడిన పెట్టుకున్న సంగతి తెలిసిందే. చూడాలి మరి.. బాలీవుడ్ లో యువీ బయోపిక్ నిర్మించడానికి ఎవరు ముందుకొస్తారో!

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+