Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టీమిండియాలోకి అతి తర్వలో SRH కుర్రాడు!

ఉప్పల్ వేదికగా బుధవారం లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. నెట్‌రన్‌రేట్‌ను గణనీయంగా పెంచుకుని ప్లేఆఫ్స్ అవకాశాలను మెరుగుపర్చుకుంది. 14 పాయింట్లతో పట్టికలో మూడో స్థానంలో నిలిచింది.

తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 165 పరుగులు చేసింది. ఆయుష్ బదోనీ (55*; 30 బంతుల్లో, 9x4) టాప్ స్కోరర్. భువనేశ్వర్ కుమార్ (2/12) రెండు వికెట్లతో సత్తాచాటాడు. అనంతరం ఛేదనకు దిగిన ఎస్‌ఆర్‌‌హెచ్ ఓపెనర్లు విధ్వంసం సృష్టించారు. ట్రావిస్ హెడ్ (89*; 30 బంతుల్లో, 8x4, 8x6), అభిషేక్ శర్మ (75*; 28 బంతుల్లో, 8x4, 6x6) చెలరేగి 9.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించారు.

Abhishek Sharma s Indian Team Inclusion Imminent- Aakash Chopra

అంతర్జాతీయ స్టార్ క్రికెటర్ ట్రావిస్ హెడ్‌తో పోటాపోటీగా పరుగులు సాధించిన అభిషేక్ శర్మపై మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ప్రశంసల జల్లు కురిపించాడు. అభిష్‌క్ మరో యువరాజ్ సింగ్‌ను తలపిస్తున్నాడని కొనియాడాడు. అంతేగాక అతను అతిత్వరలో టీమిండియా తలుపు తట్టనున్నాడని ఆకాశ్ చోప్రా జోస్యం చెప్పాడు.

''ట్రావిస్ హెడ్ హిట్టింగ్‌తో పోలిస్తే అభిషేక్ ఆట చక్కగా అనిపించింది. బ్యాక్ లిఫ్ట్‌తో షాట్లు గొప్పగా ఆడుతున్నాడు. ఇది యువరాజ్ సింగ్‌ ఆటను గుర్తుచేస్తోంది. అంతేగాక డౌన్ స్వింగ్‌తో కూడా అదరగొడుతున్నాడు. అతని బ్యాటింగ్‌లో క్లాస్ కనిపిస్తోంది. క్రికెటింగ్ షాట్లను కొనసాగింపుగా ఆడుతూ సిక్సర్లూ సాధిస్తున్నాడు''

''టీమిండియాలోకి అడుగుపెట్టడానికి అభిషేక్‌కు ఎక్కువ సమయం పట్టదు. భారత జట్టులో అతని పేరు ఉండాలి. ఇక మనకు స్ట్రైకర్లు లేరని చెప్పలేం. అభిషేక్ శర్మ, యశస్వీ జైస్వాల్ వంటి ఆటగాళ్లతో హిట్టర్ల లిస్ట్ పెద్దగా ఉంది. ఇక కొట్టలేమని వెనుదిరిగే చూసే పరిస్థితి రాకూడదు. భారత బ్యాటింగ్ భవిష్యత్ మన కళ్ల ముందు కనిపిస్తోంది. వాళ్ల ఆటను చూస్తుంటే ముచ్చటేస్తుంది'' అని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు. ఈ సీజన్‌లో 12 మ్యాచ్‌లు ఆడిన అభిషేక్ 36 సగటు, 205 స్ట్రైక్‌రేటుతో 401 పరుగులు సాధించాడు.

Story first published: Thursday, May 9, 2024, 17:38 [IST]
Other articles published on May 9, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+