సన్‌రైజర్స్ హీరోతో మహిళా అభిమాని అసభ్య ప్రవర్తన? (వీడియో)
సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మకు ఓ వింత అనుభవం ఎదురైంది. రాజస్థాన్ రాయల్స్ జట్టుతో మ్యాచ్‌కు ముందు జైపూర్‌లోని టీమ్ హోటల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. అభిషేక్ శర్మ హోటల్ లాబీ గుండా వెళ్తుండగా.. ఓ మహిళా అభిమాని అత్యుత్సాహంతో ఒక్కసారిగా ఆటన చేయి పట్టుకుని లాగింది. అనుమతి లేకుండా జరిగిన ఈ అనూహ్య పరిణామంతో అభిషేక్ శర్మ ఒక్కసారిగా అసౌకర్యానికి గురయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ క్రమంలో అభిమానులు ఆటగాళ్ల వ్యక్తిగత స్వేచ్ఛను గౌరవించాలని నెటిజన్లు కోరుతున్నారు. వెంటనే సెక్యూరిటీ సిబ్బంది జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దారు.
అభిషేక్ శర్మ విధ్వంసం
ఈ అవాంతరాలు పక్కన పెడితే మైదానంలో మాత్రం అభిషేక్ శర్మ తన బ్యాట్‌తో విధ్వంసం సృష్టించాడు. శనివారం రాజస్థాన్ రాయల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో 229 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో అభిషేక్ శర్మ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 29 బంతుల్లోనే 11 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 57 పరుగులు చేసి జట్టు విజయానికి గట్టి పునాది వేశాడు. ముఖ్యంగా ఇషాన్ కిషన్‌తో కలిసి రెండో వికెట్‌కు కేవలం 55 బంతుల్లోనే 132 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి మ్యాచ్‌ను హైదరాబాద్ వైపు తిప్పాడు.

ఆరెంజ్ క్యాప్ రేసులో అగ్రస్థానం
ప్రస్తుతం అభిషేక్ శర్మ ఐపీఎల్ 2026 ఆరెంజ్ క్యాప్ రేసులో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్‌ల్లో 212.29 స్ట్రైక్ రేట్‌తో 380 పరుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచరీ (135 పరుగులు) కూడా ఉండటం విశేషం. అభిషేక్ శర్మ నిలకడైన ఆటతీరుతో సన్‌రైజర్స్ వరుసగా నాలుగో విజయాన్ని నమోదు చేసి.. పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి చేరుకుంది. ప్లేఆఫ్స్ రేసులో హైదరాబాద్ తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది.
రాజస్థాన్ రాయల్స్ ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసి 228 పరుగుల భారీ స్కోరు సాధించినప్పటికీ.. హైదరాబాద్ బ్యాటర్ల ధాటికి తలవంచక తప్పలేదు. రాజస్థాన్ తరపున 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ 36 బంతుల్లోనే శతకం బాది రికార్డు సృష్టించినా.. ఇషాన్ కిషన్ (74), అభిషేక్ శర్మల మెరుపు ఇన్నింగ్స్‌ల వల్ల హైదరాబాద్ 18.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. తన తదుపరి మ్యాచ్‌లో భాగంగా సన్‌రైజర్స్ జట్టు ఏప్రిల్ 29న ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications