Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఒత్తిడిలో చిక్కుకుపోయిన కాటేరమ్మ కొడుకు!

టీ20 ప్రపంచ కప్ 2026లో టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ ఫామ్ ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. దక్షిణాఫ్రికాతో జరిగిన కీలక సూపర్-8 మ్యాచ్‌లో కూడా అభిషేక్ శర్మ(12 బంతుల్లో 15 పరుగులు) తక్కువ స్కోరుకే వెనుదిరగడంపై భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ స్పందించారు. టోర్నీకి ముందు అద్భుతమైన ఫామ్‌లో ఉన్న అభిషేక్ శర్మ.. ప్రపంచ కప్ వంటి మెగా ఈవెంట్లో ఎందుకు తడబడుతున్నారో గవాస్కర్ విశ్లేషించారు.

ఆ ఒత్తిడి ఆటగాడిని స్తంభింపజేస్తుంది!
స్టార్ స్పోర్ట్స్‌తో సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ.. అంతర్జాతీయ స్థాయిలో ఆడుతున్నప్పుడు ఉండే ఒత్తిడి ఆటగాడి సహజసిద్ధమైన శైలిని ఎలా దెబ్బతీస్తుందో వివరించారు. "నెట్స్‌లో ప్రాక్టీస్ చేసేటప్పుడు ఔట్ అయినా మళ్లీ బంతిని ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కానీ మ్యాచ్‌లో అలా కాదు, ఒక్క వికెట్ పడితే అంతా అయిపోతుంది. ఆ ఒత్తిడి కారణంగా ఆటగాడి కాళ్లు, చేతులు ఒక్కోసారి స్తంభిస్తాయి . అందుకే అభిషేక్ తన ఫ్రీడమ్‌ను కోల్పోయి ఆడుతున్నాడు" అని గవాస్కర్ అభిప్రాయపడ్డారు.

Abhishek Sharma Struggle Sunil Gavaskar Decodes Why the Young Opener is Failing in T20 World Cup 2026

దక్షిణాఫ్రికా పక్కా ప్లాన్..
దక్షిణాఫ్రికా బౌలర్లు అభిషేక్ శర్మను కట్టడి చేయడానికి పక్కా వ్యూహంతో బరిలోకి దిగారని గవాస్కర్ పేర్కొన్నారు. "అభిషేక్ సాధారణంగా రూమ్ చేసుకుని ఆఫ్ సైడ్ షాట్లు ఆడటానికి ఇష్టపడతాడు. అందుకే రబాడ వంటి బౌలర్లు అతనికి ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా పదేపదే ప్యాడ్లను లక్ష్యంగా చేసుకుని బంతులు వేశారు. ఒక సిక్స్ కొట్టినప్పటికీ.. దక్షిణాఫ్రికా బౌలర్లు తమ ప్లాన్ మార్చుకోకుండా తెలివిగా బౌలింగ్ చేసి అతడిని ఇబ్బంది పెట్టారు" అని చెప్పుకొచ్చారు.

బ్యాటర్లపై గవాస్కర్ ఆగ్రహం
కేవలం అభిషేక్ శర్మ మాత్రమే కాదు.. మిగిలిన భారత బ్యాటర్ల ప్రదర్శనపై కూడా సునీల్ గవాస్కర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. "ఈ పిచ్‌పై బంతి బ్యాటు మీదకు అంత సులభంగా రావడం లేదు. కానీ దక్షిణాఫ్రికా బ్యాటర్లు డేవిడ్ మిల్లర్, డెవాల్డ్ బ్రెవిస్ పిచ్ పరిస్థితులను అర్థం చేసుకుని జాగ్రత్తగా ఆడారు. భారత బ్యాటర్లు మాత్రం సరైన షాట్ సెలక్షన్ లేకుండా వికెట్లు పారేసుకున్నారు" అని సునీల్ గవాస్కర్ విమర్శించారు.

సెమీస్ చేరాలంటే ఏం చేయాలి?
భారత్ ఈ మ్యాచ్‌లో 76 పరుగుల భారీ తేడాతో ఓడిపోవడం వల్ల సెమీఫైనల్ రేసు క్లిష్టంగా మారింది.భారత్ తన తదుపరి రెండు మ్యాచ్‌ల్లో జింబాబ్వే, వెస్టిండీస్‌లను ఓడించాల్సి ఉంటుంది. ఒకవేళ దక్షిణాఫ్రికా తన తదుపరి మ్యాచ్‌ల్లో కూడా అజేయంగా నిలిస్తే, భారత్ దక్షిణాఫ్రికా వరుసగా 4, 6 పాయింట్లతో సెమీస్‌కు చేరుకోవడానికి అవకాశం ఉంటుంది.

Story first published: Monday, February 23, 2026, 14:54 [IST]
Other articles published on Feb 23, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+