ఊచకోత.. సొంత రికార్డును తిరగరాసిన పులి!
ఐపీఎల్ 2026 సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ యువ ఓపెనర్ అభిష్క్ శర్మ మరోసారి తన బ్యాటింగ్ విధ్వంసాన్ని రుచి చూపించాడు. శనివారం సీఎస్కేతో జరిగిన ఉత్కంఠభరిత పోరులో అభిషేక్ శర్మ తన సత్తా చాటుకున్నాడు. కేవలం 15 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీని పూర్తి చేసి.. సన్‌రైజర్స్ ఓపెనర్‌గా తన పేరిట ఉన్న పాత రికార్డును తానే తిరగరాశాడు. 2024లో ముంబై ఇండియన్స్‌పై 16 బంతుల్లో అర్థశతకం చేసిన రికార్డును ఇప్పుడు అధిగమించాడు.
ఈ ఇన్నింగ్స్‌లో అభిషేక్ శర్మ మొత్తం 22 బంతుల్లో 59 పరుగులు సాధించాడు. ఇందులో 6 ఫోర్లు, 4 భారీ సిక్సర్లు ఉండగా.. అభిషేక్ స్ట్రైక్ రేట్ 268కి పైగా నమోదైంది. ముఖ్యంగా ఇన్నింగ్స్ 5వ ఓవర్లో మాథ్యూ షార్ట్ బౌలింగ్‌లో ఏకంగా 25 పరుగులు రాబట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఐపీఎల్ చరిత్రోలో ఇది మూడో వేగవంతమైన హాఫ్ సెంచరీ కావడం విశేషం. యశస్వి జైస్వాల్ (13 బంతులు) అగ్రస్థానంలో ఉండగా.. కేఎల్ రాహుల్, పాట్ కమిన్స్, రొమారియో షెపర్డ్ (14 బంతులు) తర్వాత అభిషేక్ నిలిచాడు.

అభిషేక్ ఖాతాలో మరో మైలురాయి
బ్యాటింగ్ రికార్డులతో పాటు అభిషేక్ శర్మ మరో అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. ఐపీఎల్‌లో 2,000 పరుగుల మార్కును అభిషేక్ శర్మ అధిగమించాడు. ఆండ్రీ రస్సెల్ (1,120 బంతులు) తర్వాత అత్యంత తక్కువ బంతుల్లో (1,193 బంతులు) ఈ ఘనత సాధించిన రెండో ఆటగాడిగా అభిషేక్ నిలిచాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌ల్లో 229.26 స్ట్రైక్ రేట్‌తో 188 పరుగులు చేశాడు. అయితే ఈ ఏడాది 19 టీ20ల్లో 511 పరుగులు చేసినప్పటికీ.. ఒకే క్యాలెండర్ ఇయర్‌లో 7 సార్లు డకౌట్ అయిన భారతీయ ఆటగాడిగా కూడా రికార్డుల్లోకెక్కాడు.
మ్యాచ్ పరిస్థితి ఇలా..
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. అభిషేక్ శర్మ (59) తో పాటు ట్రావిస్ హెడ్ (23), హెన్రిచ్ క్లాసెన్ (59) రాణించడంతో హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. చెన్నై బౌలర్లలో అన్షుల్ కాంబోజ్, జేమీ ఓవర్టన్ తలో మూడు వికెట్లు తీశారు. అనంతరం లక్ష్య ఛేదనలో చెన్నై గట్టిగా పోరాడినప్పటికీ.. సన్‌రైజర్స్ బౌలర్లు కట్టడి చేయడంతో హైదరాబాద్ 10 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో కావ్య మారన్ సంబరాలు చేసుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications