Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రాత్రిపూట పార్టీలు.. గర్ల్‌ఫ్రెండ్స్.. అభిషేక్ శర్మ కా కహానీ!

Yograj Singh on Abhishek Sharma: అభిషేక్ శర్మ.. టీ20లో భారతదేశపు కొత్త స్టార్‌గా ఎదిగిన పేరు. చాలా తక్కువ సమయంలోనే భారత కొత్త పవర్ హిట్టర్‌గా పేరు పొందాడు. 2024 ఐపీఎల్‌లో మంచి ప్రదర్శన ఇవ్వడం ద్వారా అభిషేక్ శర్మ టీమిండియాలో చోటు సంపాదించాడు. ఒక సంవత్సరం లోపు తన ప్రత్యేక ముద్ర వేయడంలో విజయం సాధించాడు. ఇటీవలే అభిషేక్ శర్మ తొలిసారిగా బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టులో చోటు కూడా కైవసం చేసుకున్నాడు. అభిషేక్ విజయం వెనుక భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ఉన్నాడు. తుఫాను ఇన్నింగ్స్ ఆడిన ప్రతిసారీ అభిషేక్ శర్మ యువరాజ్ సింగ్ కు క్రెడిట్ ఇచ్చాడు. ఇంతలో యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ సింగ్ అభిషేక్ శర్మ జీవితాన్ని రూపొందించడంతో తన కొడుకు కీలక పాత్ర పోషించాడని వెల్లడించారు.

యువరాజ్ వల్లే..
నిజానికి అభిషేక్ శర్మను గొప్ప క్రీడాకారుడిగా తీర్చిదిద్ధడంలో తన కుమారుడు యువరాజ్ సింగ్ సహకారం ముఖ్యమని యోగరాజ్ సింగ్ అభివర్ణించారు. యోగరాజ్ సింగ్ మాట్లాడుతూ.."అభిషేక్ శర్మ ప్రదర్శన గురించి పంజాబ్ క్రికెట్ అసోసియేషన్, కోచ్‌‌తో మాట్లాడినప్పుడు అతను బౌలింగ్ ఎలా చేయాలో తెలిసిన బౌలర్ అని వారు చెప్పారు. యువీ అభిషేక్ బ్యాటింగ్ రికార్డును చూడు అని అన్నాడు. కాబట్టి మేము అభిషేక్ రికార్డులను చూశాము. అభిషేక్ అప్పటికే 24 సెంచరీలు చేశాడు. అభిషేక్ 24 సెంచరీలు చేసినా ఎందుకు తప్పుడు సమాచారం ఇస్తున్నారని యువీ అడిగాడు. ఇది ఆరు లేదా ఏడేళ్ల క్రితం జరిగిన విషయం." అని యోగరాజ్ సింగ్ చెప్పాడు. యోగరాజ్ సింగ్ ఇంకా మాట్లాడుతూ.."యువీ నాకు రికార్డును పంపి.. నాన్న.. ఈ ఆటగాడిని చూడు అని చెప్పారు. అసలు సమస్య ఏంటంటే.. కొంతమంది ఆటగాడి కెరీర్ ను నిర్మించడం కంటే అసూయతో అతడిని తొలగించాలని కోరుకుంటారు. " అని చెప్పుకొచ్చారు.

Abhishek Sharma s Journey Parties Girlfriends and How Yuvraj Singh Changed His Life

రాత్రిపూట పార్టీలు.. గర్ల్ ఫ్రెండ్స్ ను కలవకుండా యువీ ఆపాడు..
పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ.. అభిషేక్ శర్మ తండ్రి తనను మార్చడానికి చాలా ప్రయత్నించాడని, కానీ యువరాజ్ సింగ్ తన జీవితాన్ని చక్కదిద్దాడని యోగరాజ్ సింగ్ అన్నారు. అభిషేక్ అర్థరాత్రి పార్టీలను, తన గర్ల్ ఫ్రెండ్స్‌ను కలవకుండా యువరాజ్ సింగ్ ఆపాడని చెప్పారు. యోగరాజ్ సింగ్ మాట్లాడుతూ.."రాత్రిపూట పార్టీలు.. గర్ల్ ఫ్రెండ్స్.. యువరాజ్ అతడని ఇవన్నీ చేయకుండా నిషేధించాడు. అభిషేక్ తండ్రి అతడిని భరించలేకపోయాడు కానీ యువీ అతడిని మార్చేశాడు. యువీ అతడిని ఎక్కడ ఉన్నావు.. అని అరుస్తూ ఉండేవాడు. అభిషేక్ ను రాత్రి 9 గంటలైంది.. నేరుగా పడుకో.. నేను ఏమి చెబుతున్నానో నీకు అర్థమైంది, నేను రావాలా? అని అడుగుతూ యువీ అరవడం నేను స్వయంగా చూశానని యోగరాజ్ పేర్కొన్నారు. యువీకి భయబడి అభిషేక్ త్వరగా తన ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి తన గదిలో పడుకునే వాడు. యువీ తన తండ్రిని ఉదయం 5 గంటలకు నిద్ర లేపమని చెప్పేవాడని యోగరాజ్ సింగ్ చెప్పుకొచ్చారు.

యువీ శుభ్‌మన్ గిల్‌ను కూడా జాగ్రత్తగా చూసుకున్నాడు..
యువరాజ్ సింగ్ శుభ్‌మన్ గిల్‌ను కూడా అలాగే జాగ్రత్తగా చూసుకున్నాడని యోగరాజ్ సింగ్ తెలిపారు. శుభ్‌మన్ గిల్‌, అభిషేక్ శర్మ ఇద్దరూ 2018లో అండర్-19 ప్రపంచ కప్ లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించారు. శుభ్‌మన్ గిల్‌ విషయంలో కూడా అదే జరిగిందని యోగరాజ్ చెప్పారు. కానీ ఒక వజ్రం మరో వజ్రం చేతుల్లోకి వెళ్లినప్పుడే అతను కోహినూర్ అవుతాడని.. అభిషేక్ శర్మ విషయంలో కూడా అదే జరిగిందన్నాడు. ఆ వజ్రం తప్పుడు చేతుల్లో పడి ఉంటే.. అది ముక్కలుగా విరిగిపోయి ఉండేదన్నాడు. ఇలా భారత్ లో చాలా మంది వజ్రాల్లాంటి ఆటగాళ్లు విరిగిపోయారని చెప్పారు.

Story first published: Tuesday, April 22, 2025, 17:57 [IST]
Other articles published on Apr 22, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+