Abhishek Sharma: భారత క్రికెట్ యువ సంచలనం, పంజాబ్‌కు చెందిన ఓపెనింగ్ బ్యాటర్ అభిషేక్ శర్మ ఈ రోజు తన 25వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. సెప్టెంబర్ 4, 2004న అమృత్‌సర్‌లో జన్మించిన అభిషేక్ శర్మ, తన అసాధారణమైన బ్యాటింగ్‌తో భారత క్రికెట్ అభిమానుల దృష్టిని ఆకర్షించాడు. అభిషేక్ శర్మ క్రికెట్ ప్రయాణం చిన్ననాటి నుంచే చాలా ఆసక్తికరంగా సాగింది. ఎందుకంటే అభిషేక్‌కు సరైన సమయంలో సరైన వ్యక్తిత్వం కలిగిన మెంటార్ దొరికారు. అతనికి చిన్న వయస్సులోనే యువరాజ్ సింగ్ లాంటి గొప్ప క్రికెటర్ మెంటార్‌గా దొరికాడు.
'నో పార్టీ - నో గర్ల్‌ఫ్రెండ్' అని చెప్పిన యువరాజ్
క్రికెట్‌లో తన గురువుగా యువరాజ్ సింగ్‌ను భావించే అభిషేక్‌కు, అతనే సరైన మార్గదర్శనం చేశారు. యువరాజ్ సింగ్ అభిషేక్‌కు క్రికెట్ మెళకువలు నేర్పించడమే కాకుండా క్రమశిక్షణతో కూడిన జీవితం ఎలా గడపాలో కూడా యువరాజ్ సింగ్ నేర్పించాడు. యువరాజ్ తండ్రి యోగరాజ్ సింగ్ ఒకసారి మాట్లాడుతూ.. అభిషేక్ తన కెరీర్‌పై దృష్టి పెట్టేలా చూసేందుకు యువరాజ్ అతడిని నైట్ అవుట్స్, పార్టీలు, గర్ల్‌ఫ్రెండ్‌లకు పూర్తిగా దూరం చేశారని చెప్పాడు.

క్రమశిక్షణతో కూడిన కెరీర్
యువరాజ్ ఇచ్చిన ఈ సలహాను అభిషేక్ మనస్ఫూర్తిగా స్వీకరించాడు. అభిషేక్ కఠోర శ్రమకు తగ్గ ఫలితాలు వచ్చాయి. 2018లో అండర్-19 ప్రపంచ కప్ గెలిచిన భారత జట్టులో అభిషేక్ కీలక సభ్యుడిగా ఉన్నాడు. అయితే అతనికి దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున ఆరంభ ఆటగాడిగా బరిలోకి దిగి తన ఎడమచేతి వాటం బ్యాటింగ్‌తో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు. తన అద్భుతమైన ఫామ్‌తో 2024లో జింబాబ్వే పర్యటనకు ఎంపికై, అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగు పెట్టే అవకాశం దక్కించుకున్నాడు.
కశ్మీరీ అమ్మాయిని డేట్ చేస్తున్న అభిషేక్!
పరిస్థితులు ఇప్పుడు పూర్తిగా మారాయి. ఇప్పుడు అభిషేక్ శర్మ భారత జట్టులో ఒక అద్భుతమైన ఆటగాడు. అతనికి పేరు, కీర్తి రెండూ ఉన్నాయి. మీడియా కథనాల ప్రకారం, చాక్లెట్ బాయ్ లాంటి అభిషేక్ ఒక కశ్మీరీ ముస్లిం అమ్మాయి కోసం పరితపిస్తున్నాడట.
ఎవరీ లైలా ఫైసల్!
ఆ యువతి పేరు లైలా ఫైసల్. అభిషేక్ శర్మ తరచుగా ఢిల్లీలో జరిగే ఈవెంట్లలో లైలాతో కలిసి కనిపిస్తున్నాడు. లైలా ఒక మోడల్‌గా కనిపించినా.. ఆమె నిజానికి ఒక ఫ్యాషన్ ఎంటర్‌ప్రెన్యూర్. లండన్ లో పెరిగిన లైలా, ఒక సంపన్న వ్యాపారవేత్తల కుటుంబం నుంచి వచ్చింది. 2022లో ఇండియాకు తిరిగి వచ్చిన తర్వాత, తన తల్లితో కలిసి 'లైలా రూహీ ఫైసల్ డిజైన్స్' అనే ఒక హై-ఎండ్ ఫ్యాషన్ లేబుల్‌ను ప్రారంభించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఆమెకు పెద్ద సంఖ్యలో ఫాలోవర్స్ ఉన్నారు. అయితే, లైలా పేరు ఒక క్రికెటర్‌తో ముడిపడటం ఇదే మొదటిసారి కాదు. అంతకు ముందు అభిషేక్ శర్మ, తానియా సింగ్ అనే మోడల్‌తో డేటింగ్ చేసినట్లు వార్తలు వచ్చాయి. దురదృష్టవశాత్తు, ఆ మోడల్ ఫిబ్రవరి 2024లో సూరత్‌లోని ఒక అపార్ట్‌మెంట్‌లో ఆత్మహత్య చేసుకుంది.