IND VS ENG Century : SRH బ్యాటర్ దబిది దిబిడే.. అభిషేక్ శర్మ డబుల్ ధమాకా రికార్డ్
ఇంగ్లాండ్ తో జరుగుతోన్న ఐదో టీ20లో టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ అదిరే రికార్డులను ఖాతాలో వేసుకున్నాడు. 37 బంతుల్లో 270 స్ట్రైక్ రేట్ తో 10 సిక్స్ లు, 6 ఫోర్ల సాయంతో సెంచరీ బాదాడు. భారత తరఫున టీ20ల్లో ఇది సెకండ్ ఫాస్టెస్ట్ సెంచరి.
టీ20ల్లో టీమిండియా తరఫున మొదటి ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డును రోహిత్ శర్మ నమోదు చేశాడు. అతడు 35 బంతుల్లోనే శతకొట్టాడు. 2017లో శ్రీలంకపై ఈ ఫీట్ నమోదు చేశాడు. మొత్తంగా టీ20ల్లో వేగవంతమైన సెంచరీ రికార్డు సాహిల్ చౌహాన్ (ఎస్టోనియా) పేరిట ఉంది. 27 బంతుల్లోనే సెంచరీ మార్క్ ను టచ్ చేశాడు.
వేగవంతమైన హాఫ్ సెంచరీ
ఇక ఇదే మ్యాచ్ లో 17 బంతుల్లోనే అర్ధ శతకం బాది వేగవంతమైన ఫిఫ్టీల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు అభిషేక్ శర్మ. టీ20ల్లో యువరాజ్ సింగ్ (12 బంతుల్లో) తర్వాత అభిషేక్‌దే ఫాస్టెస్ట్ ఫిఫ్టి. అభిషేక్ కు టీమిండియా తరఫున గత 16 ఇన్నింగ్స్ లో ఇది నాలుగో ఫిఫ్టీ ప్లస్ కావడం విశేషం. మొత్తం మీద 188 ప్లస్ స్ట్రైక్ రేట్ తో 450 పరుగులు చేశాడు అభిషేక్.

పవర్ ప్లేలో అత్యధిక స్కోర్
అభిషేక్ విధ్వంసం ధాటికి పవర్ ప్లేల్లో (తొలి 6 ఓవర్లలో) అత్యధిక స్కోర్ నమోదు చేసింది టీమిండియా. మొదటి 6 ఓవర్లలో వికెట్ నష్టానికి 95 పరుగుల స్కోర్ చేసింది. అంతకుముందు పవర్ ప్లేల్లో టీమిండియా అత్యధిక స్కోర్ 82/2గా ఉంది. 2021లో స్కాట్లాండ్ జట్టుపై టీమిండియా ఈ స్కోర్ నమోదు చేసింది.
టీ20 పవర్ ప్లేలో భారత్ అత్యధిక స్కోర్లు ఇవే
95/1 - 2025లో ఇంగ్లాండ్ పై
82/2 - 2021లో స్కాట్లాండ్‌పై
82/1 - 2024లో బంగ్లాదేశ్‌పై
78/2 - 2018లో సౌతాఫ్రికాపై
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications