Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పెళ్లి సందడిలో కుటుంబం.. కాన్పూర్‌లో పరుగుల వేటలో అభిషేక్!

Abhishek Sharma: టీమిండియా యువ సంచలనం, స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ దేశం పట్ల తన అంకితభావాన్ని మరోసారి చాటుకున్నాడు. నేషనల్ డ్యూటీ కోసం సొంత సోదరి పెళ్లికి కూడా దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. నేడు(అక్టోబర్ 3, 2025) అభిషేక్ శర్మ ఏకైక సోదరి కోమల్ శర్మ వివాహం జరుగుతున్నప్పటికీ.. అతను పెళ్లి వేడుకల్లో పాల్గొనకుండా కాన్పూర్‌లో మ్యాచ్ ఆడటానికి చేరుకున్నాడు.

పెళ్లి రోజున స్టేడియంలో..
అభిషేక్ శర్మ సోదరి కోమల్ శర్మ వివాహం నేడు అత్యంత వైభవంగా జరగనుంది. లూథియానా నుంచి వరుడు లవిష్ ఒబెరాయ్ బరాత్ అమృత్‌సర్‌కు చేరుకుంది. పెళ్లి వేడుకల కోసం ఇల్లంతా అందంగా అలంకరించారు. ఈ గ్రాండ్ సెలబ్రేషన్‌లో పలువురు ప్రముఖులు, వీఐపీ అతిథులు పాల్గొననున్నారు. అయితే, కుటుంబం మొత్తం పెళ్లి సందడిలో మునిగి తేలుతున్న సమయంలో, అభిషేక్ మాత్రం కాన్పూర్ మైదానంలో భారత్ 'ఎ'- ఆస్ట్రేలియా 'ఎ' మధ్య జరుగుతున్న రెండో అనధికారిక వన్డే మ్యాచ్‌లో బ్యాటింగ్, ఫీల్డింగ్‌తో బిజీగా ఉండనున్నాడు.

Abhishek Sharma Chooses National Duty Over Sister Wedding

నేషనల్ డ్యూటీకి మొదటి స్థానం
తన సొంత సోదరి పెళ్లిని వదిలిపెట్టి, అభిషేక్ శర్మ జాతీయ జట్టు తరఫున ఆడటానికి రావడం దేశభక్తికి నిదర్శనం. యువ లెఫ్ట్ హ్యాండ్ ఓపెనర్ అయిన అభిషేక్ శర్మ కుటుంబ సంతోషాల కంటే ముందు జాతీయ కర్తవ్యాన్ని ఎంచుకున్నాడు. పెళ్లికి ముందు జరిగిన పసుపు, మెహందీ వంటి ఫంక్షన్లలో అభిషేక్ పాల్గొని సందడి చేశాడు. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.ప్రస్తుతం అభిషేక్ శర్మ ఇండియా 'ఎ' జట్టులో చేరినందున, ఇంతకుముందు కేవలం మొదటి మ్యాచ్‌కు మాత్రమే జట్టులో ఉన్న ప్రియాన్ష్ ఆర్య జట్టు నుండి వైదొలగాల్సి వచ్చింది.

గురువు యువీ సందడి
లూథియానాలో జరిగిన కార్యక్రమాలలో అభిషేక్ గురువు, భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ కూడా పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు. మొత్తం మీద పెళ్లి వేడుకల ఆనందాన్ని పక్కన పెట్టి, దేశానికి ఆడటానికే మొదటి స్థానం ఇచ్చిన అభిషేక్ శర్మ అంకితభావం ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.

Story first published: Friday, October 3, 2025, 13:01 [IST]
Other articles published on Oct 3, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+