Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ.. కోహ్లీ, మలన్ రికార్డులు బ్రేక్!

ICC T20I Rankings: టీమిండియా యువ సంచలనం, స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ ఐసీసీ పురుషుల టీ20 అంతర్జాతీయ ర్యాంకింగ్స్ లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఆసియా కప్ 2025లో అద్భుత ప్రదర్శన చేసిన 25 ఏళ్ల ఈ లెఫ్ట్ హ్యాండర్ బ్యాటర్ ఏకంగా 931 రేటింగ్ పాయింట్లు సాధించాడు. ఈ స్కోరు 2020 నుంచి ఇంగ్లాండ్‌కు చెందిన డేవిడ్ మలన్ పేరిట ఉన్న (919) రికార్డును బద్దలు కొట్టి ఆల్‌టైమ్ బెస్ట్‌గా నిలిచింది.

మలన్, కోహ్లీ రికార్డులు బ్రేక్
ఆసియా కప్‌లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలుచుకున్న అభిషేక్ శర్మ.. టోర్నమెంట్‌లో మొత్తం 7 మ్యాచ్‌ల్లో 314 పరుగులు చేశాడు. ఈ సమయంలో అభిషేక్ శర్మ సగటు దాదాపు 45, స్ట్రైక్ రేట్ 200గా ఉంది. ఈ దూకుడైన ఆటతీరు అభిషేక్ శర్మ టీ20 బ్యాటర్లలో నంబర్ వన్ స్థానంలో నిలబెట్టింది. సూపర్ 4లో శ్రీలంకపై 61, బంగ్లాదేశ్‌పై 75 పరుగుల ఇన్నింగ్స్‌లు ఆడిన తర్వాత అభిషేక్ శర్మ రేటింగ్ స్కోరు 931కి చేరుకుంది.

Abhishek Sharma Breaks Kohli Malan Records Creates T20I All-Time World Record

ఈ ప్రదర్శనతో అభిషేక్ శర్మ కేవలం మలన్‌ను మాత్రమే కాక, భారత లెజెండరీ బ్యాటర్ విరాట్ కోహ్లీ కెరీర్-హై అయిన 909 పాయింట్ల రికార్డును కూడా అధిగమించాడు. అభిషేక్ శర్మ ధనాధన్ బ్యాటింగ్‌తో కూడిన కొత్త టీ20 అటాకింగ్ వ్యూహం విజయవంతమైందనడానికి ఇది నిదర్శనం.

ఇతర భారత ఆటగాళ్ల ర్యాంకింగ్స్
టీమిండియా ఆసియా కప్‌లో వరుసగా 7 మ్యాచ్‌లు గెలిచి టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఫైనల్‌లో పాకిస్తాన్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించింది. ఈ విజయాల నేపథ్యంలో ఇతర భారత ఆటగాళ్ల ర్యాంకింగ్స్‌లో కూడా మార్పులు జరిగాయి. తిలక్ వర్మ 28 పాయింట్ల లాభంతో మూడో స్థానానికి చేరుకున్నాడు. తిలక్ వర్మ ఫిల్ సాల్ట్ కంటే 25 పాయింట్లు మాత్రమే వెనుకబడి ఉన్నాడు.సూర్యకుమార్ యాదవ్ ఫామ్ కోల్పోవడం వల్ల ఎనిమిదో స్థానానికి పడిపోయాడు.కుల్దీప్ యాదవ్ ఫైనల్‌లో నాలుగు వికెట్లు పడగొట్టినందుకు గానూ, బౌలర్ల ర్యాంకింగ్స్‌లో తొమ్మిది స్థానాలు ఎగబాకి 12వ స్థానానికి చేరుకున్నాడు.

Story first published: Wednesday, October 1, 2025, 18:01 [IST]
Other articles published on Oct 1, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+