Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అభిషేక్ శర్మ విధ్వంసం.. 25 బంతుల్లో మెరుపు సెంచరీ (Video)

సన్‌రైజర్స్ హైదరాబాద్ యువ సంచలనం అభిషేక్ శర్మ తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఎస్‌ఆర్‌హెచ్ తరఫున విధ్వంసకర బ్యాటింగ్ చేస్తూ రికార్డులు బద్దలు కొట్టిన అభిషేక్ అదే జోరును ఐపీఎల్ అనంతరం సాగిస్తున్నాడు. గుర్గావ్ వేదికగా జరిగిన క్లబ్ మ్యాచ్‌లో మెరుపు శతకం బాదాడు. 25 బంతుల్లో‌నే మూడంకెల స్కోరు అందుకున్నాడు.

వన్‌డౌన్‌లో వచ్చిన అభిషేక్ శర్మ 26 బంతుల్లో 103 పరుగులు చేసి వెనుదిరిగాడు. 14 సిక్సర్లు, నాలుగు ఫోర్లతో ప్రత్యర్థి బౌలర్లపై కనికరం లేకుండా విరుచుకుపడ్డాడు. 396 స్ట్రైక్‌రేటుతో పరుగులు చేశాడు. అయితే ఇది అధికారిక మ్యాచ్ కానప్పటికీ అభిషేక్ సెంచరీ గురించి నెట్టింట చర్చ సాగుతోంది. అతి త్వరలోనే ఈ యువ ఆల్‌రౌండర్ టీమిండియాలో అవకాశం దక్కించుకుంటారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Abhishek Sharma Blazes Through with 103 Runs off 26 Balls 4 Fours 14 Sixes

ఐపీఎల్-2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫైనల్ చేరడంలో 23 ఏళ్ల అభిషేక్ శర్మ కీలక పాత్ర పోషించాడు. తన ఓపెనింగ్ పార్టనర్ ట్రావిస్ హెడ్‌తో కలిసి పరుగుల వరద పారించాడ. కొద్దిసేపు క్రీజులో ఉన్నప్పటికీ అభిషేక్ ప్రత్యర్థి జట్టు కోలుకోలేని నష్టాన్ని చేసి వెళ్తుంటాడు. అభిషేక్ ఊచకోతకు ఎస్‌ఆర్‌హెచ్ పవర్‌ప్లేలో ఏకంగా 125 పరుగుల రికార్డు స్కోరు సాధించింది. అంతేగాక ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ సాధించిన 250+ స్కోరులో అభిషేక్‌ది ప్రధాన పాత్ర.

అభిషేక్ బ్యాటింగ్‌తో పాటు బంతితోనూ జట్టుకు ఉపయోగపడుతుంటాడు. అందుకే ఈ యువ బ్యాటర్‌ను టీ20 ప్రపంచకప్‌‌లో భారత జట్టుకు ఎంపిక చేయాలని మాజీ క్రికెటర్లు సూచించారు. కానీ సెలక్టర్లు అభిషేక్‌కు అవకాశం ఇవ్వలేదు. అయితే టీ20 వరల్డ్ కప్ అనంతరం టీమిండియా ఆడనున్న జింబాబ్వే, శ్రీలంక సిరీస్‌ల్లో అభిషేక్ చోటు దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి. కాగా, ఐపీఎల్-2024లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ల జాబితాలో ఈ యువ ఓపెనర్ టాప్-10లో ఉన్నాడు. 16 మ్యాచ్‌ల్లో 32 సగటు, 204 స్ట్రైక్‌రేటుతో 484 పరుగులు చేశాడు.

Story first published: Saturday, June 8, 2024, 11:41 [IST]
Other articles published on Jun 8, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+