
కోహ్లీ-పాండ్యా లేకుంటే..
పాకిస్తాన్‌పై ఈ నెల 23వ తేదీన మెల్‌బోర్న్‌లో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ- ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ద్వయం టీమిండియాను గెలిపించిన విషయం తెలిసిందే. 31 పరుగులకే నాలుగు వికెట్లు పడిన దశలో కోహ్లీ పాకిస్తాన్ బౌలర్లపై సునామీలా విరుచుకుపడ్డాడు. 53 బంతుల్లో ఆరు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 82 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అటు హార్దిక్ పాండ్యా చివరి ఓవర్ వరకూ కోహ్లీకి అండగా నిలిచాడు. 40 పరుగులు చేశాడీ ఆల్‌రౌండర్.

లోపాలున్నాయ్..
31 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోవడం, చివరి ఓవర్‌లో వికెట్ కీపర్ బ్యాటర్ దినేష్ కార్తీక్ ఒక పరుగుకే అవుట్ కావడం.. వంటి పరిణామాలు టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ లోపాలను ఎత్తి చూపాయి. ఐపీఎల్ 2023, ఆ తరువాత జరిగిన టీ20 మ్యాచ్‌లల్లో బెస్ట్ ఫినిషర్‌గా గుర్తింపు పొందిన దినేష్ కార్తీక్ అవుట్ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. టీ20 ప్రపంచకప్ 2022 మిగిలిన మ్యాచ్‌లల్లో అతనెలా ఆడతాడనేది చర్చనీయాంశమౌతోంది.

అభిషేక్ నాయర్ రాకతో..
ఈ పరిణామాల మధ్య దినేష్ కార్తీక్ తండ్రి కృష్ణకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. దినేష్ కార్తీక్- మళ్లీ ఈ స్థాయిలో క్రికెట్ ఆడటానికి తీవ్రంగా శ్రమించాల్సి వచ్చిందని పేర్కొన్నాడు. అభిషేక్ నాయర్ ఎంట్రీతో తన కుమారుడి జీవితం పూర్తిగా మారిపోయిందని చెప్పారు. తెల్లవారు జామున 2 గంటలకే దినేష్ కార్తీక్‌ను పర్వతాలపై పరుగెత్తించేవాడని అన్నారు. ఓ టెన్నిస్ ప్లేయర్ ఏ స్థాయిలో ఫిట్‌నెస్ కోసం కష్టపడతాడో అలాంటి ట్రైనింగ్ ఇచ్చాడని పేర్కొన్నారు.

పవర్ హిట్టింగ్ కోసం ఆర్ఎక్స్ మురళి..
పవర్ హిట్టింగ్ కోసం ప్రత్యేకంగా కోచ్ ఆర్ఎక్స్ మురళిని అపాయింట్ చేసుకున్నారని కృష్ణ కుమార్ వివరించారు. పవర్ హిట్టింగ్‌లో ఆర్ఎక్స్ మురళి వద్ద ప్రత్యేకంగా దినేష్ కార్తీక్ శిక్షణ తీసుకున్నాడని అన్నారు. ఒక ప్రత్యేక టీమ్‌ను వారందరూ ఏర్పాటు చేసుకున్నారని, తరచూ చిట్కాలను నేర్చుకునేవాడని చెప్పారు. ఈ ట్రైనింగ్‌లో తాను కూడా భాగస్వామినయ్యానని, అభిషేక్ నాయక్, ఆర్‌ఎక్స్ మురళి, ఇతర టీమ్ మెంబర్స్‌తో జరిగే సంభాషణను తాను రికార్డ్ చేసే వాడినని, వాటిని శిక్షణ కోసం వినియోగించుకునే వాడని కృష్ణకుమార్ అన్నారు.

డెత్ ఓవర్ల స్పెషలిస్ట్‌గా మారడం వెనుక..
డెత్-ఓవర్ల స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్‌గా కెరీర్‌ను కొనసాగించేలా దినేష్ కార్తీక్‌ను అభిషేక్ నాయర్ ప్రేరేపించారని అన్నారు. తన కుమారుడు సొంత కోచ్, ట్రైనీతో పాటు సైకాలజిస్ట్‌ను నియమించుకున్నాడని తెలిపారు. ఈ స్థాయిలో అతను కష్టపడటం వల్ల మళ్లీ జాతీయ జట్టులోకి పునరాగమనం చేయగలిగాడని, టీ20 ప్రపంచకప్ 2022కు ఎంపిక అయ్యాడని పేర్కొన్నారు. ఈ టోర్నమెంట్‌లో డీకే రాణిస్తాడని తాను విశ్వసిస్తున్నట్లు చెప్పారు.


Click it and Unblock the Notifications












