హైదరాబాద్: బంగ్లాదేశ్‌తో జరగనున్న ఏకైక టెస్టు మ్యాచ్‌కి ముందు జరిగే ప్రాక్టీస్ మ్యాచ్‌లో పాల్గొనే ఇండియా ఏ జట్టును శనివారం బీసీసీఐ ప్రకటించింది. తమిళనాడు కెప్టెన్ అభినవ్ ముకుంద్ ఇండియా ఏ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.
ఇందులో భాగంగా శనివారం సీనియర్ సెలక్షన్ కమిటీ 14 మంది సభ్యులతో కూడిన జట్టుని ఎంపిక చేసింది. ఇంగ్లాండ్ సిరిస్‌లో గాయపడిన ఆల్ రౌండర్ జయంత్ యాదవ్‌కు ఈ జట్టులో చోటు కల్పించారు. ఇంగ్లాండ్‌తో మొహాలిలో ముగిసిన టెస్టు మ్యాచ్‌లో గాయపడిన హార్ధిక్ పాండ్యా కూడా ఉన్నాడు.

వీరితో పాటు రంజీ ట్రోఫీలో టాప్ స్కోరర్‌గా ఉన్న గుజరాత్ ఆటగాడు ప్రియాంక్ పాంచల్‌తో పాటు జార్ఖండ్‌కు చెందిన టాప్ వికెట్ టేకర్ నదీమ్‌లకు ఇండియా ఏ జట్టులో చోటు కల్పించారు. ఇక బంగ్లాదేశ్ జట్టు సికింద్రాబాద్‌లోని జింఖానా గ్రౌండ్స్‌లో ఫిబ్రవరి 5, 6 తేదీల్లో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది.
ఇందులో భాగంగా ఫిబ్రవరి 2వ తేదీన బంగ్లాదేశ్ హైదరాబాద్ నగరానికి రానుంది. రెండు రోజుల విశ్రాంతి ఆ తర్వాత ట్రైనింగ్, అనంతరం భారత్ ఏ జట్టుతో 5,6 తేదీల్లో రెండు రోజుల వార్మప్ మ్యాచ్ ఆడనుంది.
ఈ వార్మప్ మ్యాచ్ సికింద్రాబాద్‌లోని జింఖానా గ్రౌండ్స్‌లో జరగనుంది. ఇక ఫిబ్రవరి 9 నుంచి 13 వరకూ ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో టీమిండియా బంగ్లా టెస్టు మ్యాచ్ ఆడనుంది. టెస్టు మ్యాచ్ ముగిసిన అనంతరం 14వ తేదీన ఆ జట్టు తిరుగు ప్రయాణం కానుంది.
Squad: Abhinav Mukund (captain), Priyank Kirit Panchal, Shreyas Iyer, Ishank Jaggi, Rishabh Pant, Ishan Kishan (wicketKeeper), Vijay Shankar, Hardik Pandya, Shahbaz Nadeem, Jayant Yadav, Kuldeep Yadav, Aniket Choudhary, CV Milind, Nitin Saini.