Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Behind the scenes: ఏబీ డివిలియర్స్ వ్యక్తిగత విషయాలను వెల్లడించిన భార్య

AB proposed to me at the Taj Mahal in India, says Danielle de Villiers

జొహాన్నెస్‌బర్గ్: ఆధునిక్ క్రికెట్‌‌లో హార్డ్ హిట్టర్‌గా, మిస్టర్ 360 డిగ్రీస్‌గా పేరు తెచ్చుకున్న బ్యాట్స్‌మెన్ దక్షిణాఫ్రికా మాజీ స్పెషలిస్ట్ క్రికెటర్.. ఏబీ డివిలియర్స్. అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకొన్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో కొనసాగుతున్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్‌ బ్యాటింగ్ విభాగానికి వెన్నెముకగా ఉంటున్నాడు. గ్రౌండ్‌లో ఏ మూలకైనా బంతిని పంపించగల సమర్థుడు. అందుకే మిస్టర్ 360 డిగ్రీస్ అని పిలుచుకుంటుంటారు ఫ్యాన్స్. అభిమానుల అంచనాలకు అనుగుణంగా అతని ఆటతీరు చూడముచ్చటగా ఉంటుంది.

భారత్‌లో కూడా మోస్ట్ లవ్డ్ క్రికెటర్ అతను. క్రికెట్ ప్రేమికులకు అతణ్ని మరింత చేరువ చేసింది ఐపీఎల్. ఈ ఐపీఎల్ సీజన్‌లో ముంబై ఇండియన్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్‌ను ఒంటిచేత్తో గెలిపించాడు. బ్యాటింగ్ లైనప్ మొత్తం కుప్పకూలిపోయిన వెళ.. 27 బంతుల్లో 48 పరుగులు చేసి, జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఎప్పట్లాగే అతని ఫామ్ ఈ ఎడిషన్‌లోనూ కొనసాగుతోంది. ఏబీ డివిలియర్స్‌కు సంబంధించిన కొన్ని వ్యక్తిగత విషయాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. అతని భార్య డేనియల్లె స్వయంగా వాటిని వెల్లడించారు.

డివిలియర్స్-డేనియల్లేది లవ్ మ్యారేజ్. గ్రౌండ్‌లో విధ్వంసకారుడిగా, బౌలర్లపై ఏ మాత్రం కనికరం లేకుండా విరుచుకుపడే ఏబీ.. గ్రౌండ్ వెలుపల దీనికి పూర్తి భిన్నంగా ఉంటాడట. బాధ్యత గల ఓ భర్తగా, తండ్రిగా మసలు కుంటాడని డేనియల్లె తెలిపారు. మూగజీవాలు అంటే అతనికి ఆరోప్రాణమని పేర్కొన్నారు. తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఏబీ డివిలియర్స్ అభిమానులతో ఆమె ఓ డిబేట్ పెట్టారు. అభిమానులు సంధించిన ప్రశ్నలకు ఇన్‌స్టా ద్వారా సమాధానం ఇచ్చారు. వారిద్దరి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు ప్రశ్నలొచ్చాయి. వాటన్నింటికీ బదులిచ్చారామె.

తమది పెద్దలు కుదిర్చిన ప్రేమ వివాహమని డేనియల్లె ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. మొదటిసారిగా ఏబీ డివిలియర్స్ తనను భారత్‌లోని తాజ్‌మహల్ వద్ద ప్రపోజ్ చేశాడని చెప్పారు. ఐపీఎల్ మ్యాచ్‌లను తిలకించడానికి వచ్చిన తాను తండ్రితో కలిసి తాజ్‌మహల్‌ను చూడటానికి వెళ్లానని, ఆగ్రాలో తాను బస చేసిన లాడ్జ్‌కు ఏబీ తన తల్లితో కలిసి వచ్చాడని వివరించారు. పెద్దల సమక్షంలో ప్రపోజ్ చేశాడని అన్నారు. ఆ తరువాత దక్షిణాఫ్రికా వెళ్లిన వెంటనే పెళ్లి చేసుకున్నామని చెప్పారు.

Story first published: Friday, April 16, 2021, 13:39 [IST]
Other articles published on Apr 16, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+