నెంబర్ వన్‌గా డివిలియర్స్ రికార్డు: రెండో స్ధానంలో కోహ్లీ
హైదరాబాద్: శుక్రవారం ఐసీసీ ప్రకటించిన తాజా వన్డే ర్యాంకుల్లో దక్షిణాఫ్రికా ఆటగాడు ఏబీ డివిలియర్స్ అగ్రస్థానానికి కైవసం చేసుకున్నాడు. నాలుగు నెలల విరామం తర్వాత బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో వన్డేలో 176 పరుగులతో తన కెరీర్‌లోనే డివిలియర్స్ అత్యధిక స్కోరుని సాధించాడు.
దీంతో తాజా ర్యాంకింగ్స్‌లో డివిలియర్స్ 879 పాయింట్లతో రెండు స్థానాలు ఎగబాకి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. మరోవైపు టీమిండియా కెప్టెన్ విరాట కోహ్లీ(877 పాయింట్ల)తో రెండో స్థానానికి దిగజారాడు. డివిలియర్స్ వన్డేల్లో అగ్రస్ధానంలో నిలవడం వరుసగా ఇది 14వసారి కావడం గమనార్హం.
2010లో తొలిసారి అగ్రస్ధానంలో నిలిచిన ఏబీ డివిలియర్స్ వెస్టిండిస్ క్రికెట్ దిగ్గజం వివియన్ రిచర్డ్స్ తర్వాత ఎక్కువ రోజులు అగ్రస్థానంలో నిలిచిన బ్యాట్స్‌మెన్‌గా అరుదైన రికార్డు సాధించాడు. డివిలియర్స్ ఇప్పటి వరకు 2124 రోజులు అగ్రస్థానంలో నిలవగా, రిచర్డ్స్ 2306 రోజులు నెంబర్ వన్‌గా కొనసాగాడు.

రెండో స్ధానానికి పడిపోయిన కోహ్లీ ర్యాంకు
ఇక, ఆస్ట్రేలియాకు చెందిన డేవిడ్ వార్నర్ 865 పాయింట్లతో మూడోస్థానంలో కొనసాగుతుండగా, ఈ మధ్య కాలంలో అద్భుత ప్రదర్శన చేస్తున్న బాబర్ అజమ్ నాలుగోస్థానంలో నిలిచాడు. కోహ్లీ తర్వాత రోహిత్ శర్మ కూడా రెండు స్థానాలు కోల్పోయి 7వ ర్యాంకుతో సరిపెట్టుకున్నాడు.
తొలిసారి అగ్రస్థానానికి చేరుకున్న హసన్ అలీ
ధోని(12), ధావన్(14) స్థానాల్లో నిలిచారు. ఇక, బౌలింగ్ విభాగం విషయానికి వస్తే పాకిస్థాన్ బౌలర్ హసన్ అలీ తొలిసారి అగ్రస్థానానికి చేరుకున్నాడు. శ్రీలంకతో జరిగిన సిరీస్‌లో అద్భుత ప్రదర్శన చేయడంతో 743 పాయింట్లతో ఆరు స్ధానాలు ఎగబాకి హసన్ అలీ అగ్రస్ధానాన్ని దక్కించుకోవడం విశేషం.
ఈ ఏడాది అగ్రస్ధానానికి చేరిన ఐదో బౌలర్
ఈ ఏడాది ట్రెంట్ బౌల్ట్, ఇమ్రాన్ తాహిర్, రబడ, హెజెల్‌వుడ్ తర్వాత అగ్ర స్థానానికి చేరుకున్న ఐదో బౌలర్ హసన్ కావడం విశేషం. ఇక, భారత బౌలర్లు బుమ్రా, అక్షర్ పటేల్ ఒక స్థానం కోల్పోయి 6, 8 ర్యాంకుల్లో కొనసాగుతున్నారు. ఆల్‌రౌండర్ల జాబితాలో బంగ్లాదేశ్‌కు చెందిన షకీబ్ అల్ హసన్‌ను వెనక్కి నెట్టిన మహమ్మద్ హఫీజ్ తొలి స్థానంలో నిలిచాడు.
ఆసీస్‌పై 4-1తో సిరిస్ కైవసం చేసుకున్న భారత్
ఆస్ట్రేలియాపై 4-1తో వన్డే సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత్ వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని దక్కించుకున్న విషయం తెలిసిందే. తాజాగా దక్షిణాఫ్రికా.. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌ను ఇప్పటికే 2-0తో సిరిస్‌ను కైవసం చేసుకోవడంతో ర్యాంకింగ్స్‌లో దక్షిణాఫ్రికా(120) తిరిగి అగ్రస్ధానంలో నిలిచింది.
వ్యత్యాసం డెసిమల్ పాయింట్లు మాత్రమే
భారత్ కూడా 120 పాయింట్లతో ఉన్నప్పటికీ ఇరు జట్ల మధ్య డెసిమల్ పాయింట్ల వ్యత్యాసం మాత్రమే ఉంది. మూడో వన్డేలోనూ సఫారీలు గెలిస్తే.. ఆ జట్టు ఖాతాలో 121 పాయింట్లు చేరతాయి. మరోవైపు ఆదివారం నుంచి న్యూజిలాండ్‌తో జరగనున్న మూడు వన్డేల సిరీస్‌ను కైవసం చేసుకుంటే.. టీమిండియా తిరిగి అగ్రస్థానానికి చేరుకుంటుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications