Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్‌లో ఎక్కువ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌లు గెలుచుకున్న‌ది ఎవ‌రో తెలుసా? టాప్ 5 లిస్ట్ ఇదిగో!

AB de Villiers top list of most times Man of the Match winning players in IPL
IPL 2022 : Top 5 Players With Most "Man Of The Match" Winning In IPL | Oneindia Telugu

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2022 మ‌రో 5 రోజుల్లోనే ప్రారంభంకానుంది. అభిమానుల‌ను అల‌రించ‌డానికి 10 జ‌ట్లు కూడా పూర్తిగా సిద్ధ‌మ‌వుతున్నాయి. దీంతో ప్ర‌స్తుతం ఎక్క‌డ చూసిన ఐపీఎల్ గురించే చ‌ర్చ సాగుతుంది. ఇందులో ముఖ్యంగా గ‌డిచిన 14 సీజ‌న్ల‌లో అత్య‌ధిక సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న ఆట‌గాళ్లు ఎవ‌ర‌ని అభిమానులు తెగ ఆరా తీస్తున్నారు.

టాప్‌లో డివిల్లియ‌ర్స్‌

టాప్‌లో డివిల్లియ‌ర్స్‌

ఐపీఎల్‌లో ఇప్ప‌టివ‌ర‌కు అత్య‌ధిక సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న రికార్డు ద‌క్షిణాఫ్రికా దిగ్గ‌జం ఏబీ డివిల్లియ‌ర్స్ పేరు మీద ఉంది. ఐపీఎల్‌లో అన్నీ సీజ‌న్ల‌లో రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుకే ప్రాతినిధ్యం వ‌హించిన డివిల్లియ‌ర్స్ 25 సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలుచుకున్నాడు. ఐపీఎల్‌లో 184 మ్యాచ్‌లాడిన డివిల్లియ‌ర్స్ 39 స‌గ‌టుతో 5162 ప‌రుగులు చేశాడు. ఇందులో 40 హాఫ్ సెంచ‌రీలు, 3 సెంచ‌రీలు ఉన్నాయి. అత్య‌ధిక స్కోర్ 133 ప‌రుగులుగా ఉంది.

రెండు, మూడు స్థానాల్లో ఎవ‌రంటే..

ఐపీఎల్‌లో అత్య‌ధిక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న ఆట‌గాళ్ల జాబితాలో వెస్టిండీస్ దిగ్గ‌జం క్రిస్ గేల్ రెండో స్థానంలో ఉన్నాడు. గేల్ 22 సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఐపీఎల్‌లో 142 మ్యాచ్‌లాడిన గేల్ 39 స‌గ‌టుతో 4965 ప‌రుగులు చేశాడు. ఇందులో 6 సెంచ‌రీలు, 31 హాఫ్ సెంచ‌రీలున్నాయి. అత్య‌ధిక స్కోర్ 175* ప‌రుగులుగా ఉంది. ఇక ఈ జాబితాలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ మూడో స్థానంలో ఉన్నాడు. ఐపీఎల్‌లో హిట్‌మ్యాన్ ఇప్ప‌టివ‌ర‌కు 18 సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలుచుకున్నాడు. ఐపీఎల్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 213 మ్యాచ్‌లాడిన హిట్‌మ్యాన్ 31 స‌గ‌టుతో 5611 ప‌రుగులు చేశాడు. ఇందులో 40 హాఫ్ సెంచ‌రీలు, ఒక సెంచ‌రీ ఉన్నాయి.

4, 5 స్థానాల్లో వారే

4, 5 స్థానాల్లో వారే

ఇక నాల్గో స్థానంలో ఆస్ట్రేలియా డ్యాషింగ్ ఓపెన‌ర్ డేవిడ్ వార్న‌ర్ ఉన్నాడు. డేవిడ్ వార్న‌ర్ ఇప్ప‌టివ‌ర‌కు 17 సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుల‌ను గెలుచుకున్నాడు. ఐపీఎల్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 150 మ్యాచ్‌లాడిన వార్న‌ర్ 41 స‌గ‌టుతో 5449 ప‌రుగులు చేశాడు. ఇందులో 50 హాఫ్ సెంచ‌రీలు, 4 సెంచ‌రీలు ఉన్నాయి. ఇక టీమిండియా మాజీ కెప్టెన్ మ‌హేంద్ర‌సింగ్ ధోని కూడా ఈ జాబితాలో 17 హాఫ్ సెంచ‌రీల‌తో ఐదో స్థానంలో ఉన్నాడు. ఐపీఎల్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 220 మ్యాచ్‌లాడిన ధోని 39 స‌గ‌టుతో 4746 ప‌రుగులు చేశాడు. ఇందులో 23 హాఫ్ సెంచ‌రీలు ఉన్నాయి. కాగా అత్య‌ధిక సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న ఆట‌గాళ్ల జాబితాలో టాప్ 5లో అంద‌రూ బ్యాట‌ర్లే ఉండ‌డం గ‌మ‌నార్హం. టాప్ 5లో ఒక్క బౌల‌ర్ కూడా చోటు ద‌క్కించుకోలేక‌పోయాడు.

Story first published: Monday, March 21, 2022, 15:05 [IST]
Other articles published on Mar 21, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+