Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2022: ఆర్సీబీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్‌.. జ‌ట్టులోకి ఏబీ డివిల్లియ‌ర్స్ రీఎంట్రీ!

AB De Villiers To Return As Mentor For Royal Challengers Bangalore RCB For IPL 2022

రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌. దిగ్గ‌జ ఆట‌గాడు ఏబీ డివిల్లియ‌ర్స్ రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్టులోకి మ‌ళ్లీ రీఎంట్రీ ఇచ్చే అవ‌కాశం ఉంది. అయితే ఈ సారి ఆట‌గాడిగా కాకుండా మెంటార్ పాత్ర‌లో ఆర్సీబీ జ‌ట్టులో కనిపించ‌నున్నాడు. ఐపీఎల్‌లో ఆడినంత కాలం రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్టుకే ప్రాతినిధ్యం వ‌హించిన డివిల్లియ‌ర్స్ గ‌తేడాది క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్ల‌కు వీడ్కోలు ప్ర‌క‌టించాడు.

మెంటార్‌గా డివిల్లియ‌ర్స్‌

మెంటార్‌గా డివిల్లియ‌ర్స్‌

ఈ నెల 12న‌ సాయంత్రం 4 గంట‌ల‌కు త‌మ జ‌ట్టుకు సంబంధించిన కీల‌క అప్‌డేట్లను వెల్ల‌డిస్తామ‌ని రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు మేనేజ్‌మెంట్ మంగ‌ళ‌వారం ప్ర‌క‌టించింది. ఆ రోజు త‌మ జ‌ట్టు కెప్టెన్‌తోపాటు ఇత‌ర వివ‌రాలు చెబుతామ‌ని వెల్ల‌డించింది. ఇందులో భాగంగానే 38 ఏళ్ల‌ డివిల్లియ‌ర్స్‌ను మెంటార్‌గా నియ‌మించ‌నుంద‌ని స‌మాచారం.

ఈ మేర‌కు ద‌క్షిణాఫ్రికాకు చెందిన‌ డివిల్లియ‌ర్స్‌ను స‌న్నిహిత మిత్రుడైన విరాట్ కోహ్లీ కోర‌డంతో ఏబీ కాద‌నలేక‌పోయాడ‌ని తెలుస్తోంది. కాగా ఆర్సీబీ నూత‌న కెప్టెన్‌గా కూడా దక్షిణాఫ్రికాకే చెందిన ఫాఫ్ డుప్లిసెస్‌ను ప్ర‌క‌టించే అవ‌కాశాలు ఉన్నాయి. కాగా మార్చి 12న చర్చి స్ట్రీట్‌లోని మ్యూజియం క్రాస్ రోడ్‌లో జట్టు పద్నాలుగేళ్ల వేడుకలను జరుపుకోనున్నట్లు ఆర్సీబీ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.

ఏబీ డివిల్లియ‌ర్స్ రికార్డులు

ఏబీ డివిల్లియ‌ర్స్ రికార్డులు

గ‌త ఐపీఎల్‌ సీజ‌న్లో రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు త‌ర‌ఫున‌ 15 మ్యాచ్‌ల్లో ప్రాతినిధ్యం వ‌హించిన ఏబీ డివిల్లియ‌ర్స్ 148.34 స్ట్రైక్ రేట్‌తో 313 పరుగులు చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచ‌రీలు కూడా ఉన్నాయి. ఇక ఐపీఎల్‌లో అత్యంత విజ‌య‌వంత‌మైన ఆట‌గాళ్ల‌లో ఏబీ డివిల్లియ‌ర్స్ ఒక‌డు. ఈ లీగ్‌లో 184 మ్యాచ్‌లు ఆడిన డివిల్లియ‌ర్స్ 39 స‌గ‌టుతో 5162 ప‌రుగులు చేశాడు. స్ట్రైక్ రేట్ 151గా ఉంది. ఇందులో 3 సెంచ‌రీలు, 40 హాఫ్ సెంచ‌రీలు ఉన్నాయి. ఈ క్ర‌మంలో డివిల్లియ‌ర్స్ 413 ఫోర్లు, 251 సిక్సులు బాదాడు.

IPL 2022 : Virat Kohli Has No Chance Of Becoming RCB Captain Again | Oneindia Telugu
రాయల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు పూర్తి జ‌ట్టు ఐపీఎల్ 2022

రాయల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు పూర్తి జ‌ట్టు ఐపీఎల్ 2022

విరాట్ కోహ్లీ (15 కోట్లు), మ్యాక్స్‌వెల్‌తో (11 కోట్లు), మహమ్మద్ సిరాజ్ (7 కోట్లు), వానిందు హసరంగ (10.75 కోట్లు), హర్షల్‌ పటేల్ (10.75 కోట్లు), డుప్లెసిస్ ( 7 కోట్లు), దినేశ్‌ కార్తీక్ (5.5 కోట్లు), జోష్‌ హేజిల్ వుడ్ (7.75 కోట్లు), షాబాజ్‌ అహ్మద్ (2.4 కోట్లు), అనుజ్‌ రావత్ (3.4 కోట్లు), డేవిడ్‌ విల్లే ( 2 కోట్లు), షెర్ఫానే రూథర్‌ఫోర్డ్ (కోటి) మహిపాల్‌ లామ్రోర్ (95 లక్షలు), ఫిన్‌ అలెన్ ( 80 లక్షలు), జేసన్‌ బెహ్‌రెండోర్ఫ్ ( 75 లక్షలు), సిద్ధార్థ్‌ కౌల్ (75 లక్షలు), కర్ణ్‌ శర్మ (50 లక్షలు), చామ మిలింద్ (25 లక్షలు), సుయాశ్‌ ప్రభుదేశాయ్ (30 లక్షలు), ఆకాశ్‌ దీప్‌, అనీశ్వర్‌ గౌతమ్‌, లువ్‌నిత్‌ సిసోడియా (వీరంద‌రికీ 20 లక్షలు).

Story first published: Wednesday, March 9, 2022, 16:56 [IST]
Other articles published on Mar 9, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+