
కోహ్లీ కూడా చూచాయగా చెప్పాడు
ఇకపోతే 2018లో అంతర్జాతీయ క్రికెట్‌కి గుడ్ బై చెప్పేసిన ఏబీ డివిలియర్స్.. గతేడాది ఐపీఎల్‌కి కూడా రిటైర్మెంట్ ప్రకటించేశాడు. అయితే ఇటీవల వచ్చే ఏడాది ఐపీఎల్‌కి బెంగళూరు టీమ్‌లో ఏబీడీ ఉంటాడని ఆ జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ చూచాయగా తెలిపాడు. డివిలియర్స్‌ను మిస్సవుతున్నా ఆర్సీబీలోకి తర్వాతి సీజన్లో అతను వస్తాడనుకుంటా అంటూ కోహ్లీ హింట్ ఇచ్చాడు. ఏబీడీ ప్రస్తుతం అమెరికాలో గోల్ఫ్ ఆడుతూ, చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. అలాగే ఆర్సీబీ ఆడే మ్యాచ్‌లను కూడా చూస్తూ అప్పుడప్పుడు తన అభిప్రాయాలను కూడా వ్యక్తీకరిస్తున్నాడు.

ఆర్సీబీ సపోర్టింగ్ స్టాఫ్‌లో డివిలియర్స్ !
ఇక విరాట్ కోహ్లీ ఇంటర్వ్యూ వ్యాఖ్యలకు బలం చేకూర్చేలా ఏబీ డివిలియర్స్ తాజాగా తాను ఐపీఎల్ 2023 సీజన్లో అందుబాటులో ఉంటానంటూ పేర్కొనడంతో ఏబీడీ ఐపీఎల్ రీఎంట్రీ కన్ఫామ్ అయింది. ముఖ్యంగా ఆర్సీబీ సపోర్టింగ్ స్టాఫ్‌లో ఏబీడీ చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే వాస్తవానికి ఈ సీజన్లోనే ఏబీడీ ఆర్సీబీ మెంటార్‌గా ఉంటాడని అప్పట్లో వార్తలొచ్చాయి. కానీ తీరిక లేని క్రికెట్ ఆడుతున్నానంటూ ఆ మధ్య పేర్కొన్న ఏబీడీ కాస్త రిలాక్స్ మోడ్ లోకి వెళ్లడానికి ఈ ఐపీఎల్ కు దూరం అయ్యాడు.

ఐపీఎల్‌కే వన్నె తెచ్చిన యోధుడు
ఇక 2011లో బెంగళూరు జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఏబీ డివిలియర్స్.. ఆ టీమ్ తరఫున 150మ్యాచ్‌లాడాడు. అలాగే 4491 పరుగులు చేశాడు. ఓవరాల్‌గా ఐపీఎల్ కెరీర్లో 184మ్యాచ్‌లాడిన ఈ పవర్ హిట్టర్ 5162పరుగులు చేశాడు. ఎన్నో మ్యాచ్‌ల్లో ఆర్సీబీని విజయతీరాలకు చేర్చాడు. తన బ్యాటింగ్ వల్ల ఆర్సీబీకే కాకుండా ఐపీఎల్ కే వన్నె తెచ్చే ఎన్నో ఇన్నింగ్స్ ఏబీడీ బ్యాట్ నుంచి ధారకట్టాయి. ఇక గత ఏడాది కోహ్లీ కెప్టెన్సీ నుంచి వైదొలిగాక.. ఏబీడీ సైతం ఐపీఎల్ కు గుడ్ బై చెప్పేశాడు. ఏదేమైనా ఏబీడీ మళ్లీ గ్రౌండ్లో కన్పిస్తే మాత్రం అభిమానులు, ముఖ్యంగా ఆర్సీబీ ఫ్యాన్స్ ఖుషీ వేరే లెవల్లో ఉంటుందనేది తథ్యం.