అవేవీ నిజం కాదు, ఫ్రెష్‌నెస్ కోసమే: డీవిలియర్స్
డర్బన్: దక్షిణాఫ్రికా విధ్వంసకర బ్యాట్స్‌మన్ ఏబీ డివిలియర్స్ ఓ ఫార్మాట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించే యోచనలో ఉన్నాడు. తీరికలేని క్రికెట్ షెడ్యూల్‌తో తీవ్ర అలసటకు గురవుతున్నానని, కొన్నాళ్లు గడిచాక ఏదో ఓ ఫార్మాట్లో తాను ఆడకపోవచ్చని 31 ఏళ్ల డివిలియర్స్ చెప్పాడు.
డివిలియర్స్ అటువంటి ఆలోచన చేయడంపై పలు వదంతులు వ్యాపించాయి. అయితే దక్షిణాఫ్రికా క్రికెట్‌లోని వ్యవహారాలు నచ్చకే రిటైర్మెంట్ ఆలోచనలో డివిలియర్స్ పడ్డాడని అతని మాజీ టీమ్ సభ్యులు చెప్పినట్టు మీడియాలో వార్తకథనాలు వచ్చాయి. ఆ కథనాలను డివిలియర్స్ ఖండించాడు.

ఎన్నో వదంతులు వ్యాపిస్తున్నాయని, కానీ అవేవి నిజం కాదని, రెండు, మూడేళ్లుగా అపరిమిత క్రికెట్‌తో ఒత్తిడికి గురవుతున్నట్టు చెబుతూనే ఉన్నానని, ఇప్పుడిక విశ్రాంతి అవసరమని భావిస్తున్నానని అతను అన్నాడు
ఫ్రెష్‌గా ఉండడానికి పని భారం తగ్గించుకోవాలనుకుంటున్నట్లు తెలిపాడు. భవిష్యత్‌లో అన్ని ఫార్మాట్లలో ఆడకపొవచ్చునని డివిలియర్స్ చెప్పాడుడు. వన్డే జట్టుకు కెప్టెన్ అయిన డివిలియర్స్.. పరిమిత ఓవర్ల క్రికెట్లో కొనసాగుతూనే, టెస్టుల నుంచి తప్పుకునే అవకాశముంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications