నా రిటైర్మెంట్‌కు అసలు కారణం అదే: డివిలియర్స్

న్యూఢిల్లీ: 2015 ప్రపంచకప్ సెమీఫైనల్‌లో న్యూజిలాండ్‌పై ఓటమి తనను ఎంతోగానో కుంగదీసిందని దక్షణాఫ్రికా దిగ్గజ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ అన్నాడు. ఆ ఓటమి తనను ఏడాదికి పైగానే వెంటాడిందని, క్రికెట్ నుంచి తాను ఆకస్మికంగా రిటైరవడానికి ఆ పరాజయం ఓ బలమైన కారణమైందని డివిలియర్స్ చెప్పుకొచ్చాడు. ఉత్తమ ఫామ్‌లో ఉన్నా కూడా 2018లో అనూహ్యంగా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఈ మాజీ కెప్టెన్ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. అయితే ఆ నిర్ణయం వెనకాల ఉన్న కారణాన్ని ఇప్పటివరకూ బయటపెట్టని ఏబీ.. తాజాగా అందుకు ప్రభావితం చేసిన విషయాల గురించి వెల్లడించాడు.

ప్రపంచకప్ ఓటమి కుంగదీసింది
భారత కామెంటేటర్ హర్షా భోగ్లే బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో ఏబీ డివిలియర్స్ పలు అంశాలపై మాట్లాడాడు. '2015 వన్డే ప్రపంచకప్ సెమీస్ ఓటమి నన్ను కుంగదీసింది. దాదాపు 12 నెలల పాటు ఆ కుంగుబాటు నుంచి బయటపడటానికి ప్రయత్నించా. అయినప్పటికీ తిరిగి ఆడడం మొదలెట్టా. బ్యాటింగ్‌లో అత్యుత్తమంగా రాణించా. కానీ.. ఆ ఓటమి నన్ను వెంటాడుతూ వచ్చింది. ఆ అపజయం నుంచి బయట పడలేకపోయా. దీంతో ఆ ప్రపంచకప్ దగ్గరే ఆగిపోయానని అర్థమైంది' అని ఏబీ చెప్పాడు.

ఒంటరినైపోయా అనిపించేది
'ఆ ఓటమి గురించి ఆలోచించిన ప్రతిసారి ఒంటరినైపోయా అనిపించేది. వ్యక్తిగతంగా చూస్తే రిటైర్మెంట్ ప్రకటించడంలో ఆ ఓటమి ప్రధాన పాత్ర పోషించింది. నా సున్నిత మనసుపై పెను ప్రభావం చూపింది' అని ఏబీ డివిలియర్స్ పేర్కొన్నాడు. 2015 వన్డే ప్రపంచకప్ సెమీస్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై 4 వికెట్ల తేడాతో గెలుపొందిన న్యూజిలాండ్ ఫైనల్‌కి దూసుకెళ్లింది. కానీ అక్కడ బోల్తా కొట్టింది. టోర్నీ ఆసాంతం అద్భుత ప్రదర్శన చేసిన కివీస్ జట్టు ఫైనల్ మెట్టుపై ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. ఏబీ ప్రొటీస్ తరఫున 114 టెస్టులు, 228 వన్డేలు, 78 టీ20లు ఆడాడు.

కెరీర్ బెస్ట్ ఫామ్ కనబరుస్తున్న దశలో వీడ్కోలు
2018 ఐపీఎల్ సీజన్‌లో అద్భుతంగా మ్యాచ్‌లాడిన ఏబీ డివిలియర్స్.. టోర్నీలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేఆఫ్‌కి అర్హత సాధించలేకపోవడంతో నిరాశగా స్వదేశానికి వెళ్లాడు. ఆ తర్వాత కొన్ని రోజుల వ్యవధిలోనే అంతర్జాతీయ క్రికెట్‌కి డివిలియర్స్ రిటైర్మెంట్ ప్రకటించేశాడు. కెరీర్ బెస్ట్ ఫామ్‌ని కనబరుస్తున్న దశలో అలా వీడ్కోలు చెప్పడమేంటని అప్పట్లో అందరూ ఆశ్చర్యపోయారు. ప్రైవేట్ టీ20 లీగ్‌లపై ఎక్కువ దృష్టి పెట్టుందుకే ఆ నిర్ణయం తీసుకున్నాడని కొందరు ఆరోపించారు. దక్షిణాఫ్రికా జట్టు భవితవ్యం గురించి ఏమాత్రం ఆలోచించకుండా స్వార్థపూరితంగా రిటైర్మెంట్ ప్రకటించాడని ఆ దేశ మాజీ క్రికెటర్లు విమర్శించారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
జీవితాతం సోదరులమే.. సామికి క్షమాపణలు చెప్పిన ఇషాంత్!!