వరుస ఓటములపై డివిలియర్స్: ఆర్సీబీ ప్లేఆఫ్స్‌కు చేరుకునేనా?

హైదరాబాద్: ఐపీఎల్ 2019 సీజన్ కోహ్లీ నాయకత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టుకి ఎంతమాత్రం కలిసి రాలేదు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆ జట్టు ఆడిన ఆరు మ్యాచ్‌ల్లోనూ ఓటిమిపాలైంది. తద్వారా ఈ సీజన్‌లో ఆర్సీబీ ఇప్పటివరకు గెలుపు రుచిని చూడలేదు. ఆర్సీబీ ఇంకా 8 మ్యాచ్‌ల్లోను ఆడాల్సి ఉంది. ఈ 8 మ్యాచ్‌ల్లో విజయం సాధిస్తే ప్లేఆఫ్‌కు చేరుకుంటుంది లేదంటే లీగ్ దశలోనే నిష్క్రమిస్తుంది.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

స్టార్ ప్లేయర్లు ఉన్నప్పటికీ
విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్, సిమ్రాన్ హెట్‌మెయిర్, యజవేంద్ర చాహల్, టిమ్ సౌథీ లాంటి స్టార్ ప్లేయర్లు ఉన్నప్పటికీ ఆ జట్టుకు విజయాలను అందించలేకపోతున్నారు. వరుసగా ఆరు ఓటములపై ఆ జట్టు స్టార్ ప్లేయర్ ఏబీ డివిలియర్స్ స్పందించాడు. టైమ్స్ ఆఫ్ ఇండియాకు రాసిన కాలమ్‌లో ఈ సీజన్‌లో ఆర్సీబీ ఎక్కడ వెనుకబడిందో వెల్లడించాడు.

ప్రతి ప్లేయర్ ప్రత్యేక నైపుణ్యం ఉన్నవారే
"జట్టులో ప్రతి ప్లేయర్ ప్రత్యేక నైపుణ్యం ఉన్నవారే. బ్యాట్స్‌మన్ లేదంటే బౌలర్. వారనుకున్నట్లు మొదటగా దానికే ప్రాధాన్యం ఇవ్వాలి. కానీ, దాంతో పాటు ప్రతి ప్లేయర్ మంచి ఫీల్డర్‌గా ఉండాలనే సంగతి మర్చిపోకూడదు. మైదానంలో ఉన్నంత సేపు బంతి ఎప్పుడు వస్తుందాననే ఆశతో చూస్తూ ఉండాలి. బహుశా మేం ఓడిపోవడానికి కారణమిదేననుకుంటున్నా" అని డివిలియర్స్ అన్నాడు.

మూడు మ్యాచ్‌ల్లో విజయానికి దగ్గరగా వచ్చి
కోల్‌కతా, ముంబై జట్లతో జరిగిన మ్యాచ్‌ల్లో విజయానికి దగ్గరగా వచ్చిన ఆర్సీబీ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనైతే ఆర్సీబీ ఏకంగా 200 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించినప్పటికీ ఓడిపోవడం అటు అభిమానులతో పాటు జట్టులో ఆటగాళ్లను సైతం నిరాశకు గురి చేసింది.

స్వల్ప వ్యత్యాసంతో ఓడిపోతున్నాం
"ఢిల్లీ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ లోనూ 149 పరుగులు చేసి విజయాన్ని దక్కించుకోలేకపోయాం. ముగిసిన ఆరు మ్యాచ్‌ల్లో 3 మ్యాచ్‌ల్లో విజయం అందినట్లే అంది చేజారిపోయింది. టోర్నీలో మా ఫీల్డింగ్ మరింత పేలవంగా అనిపిస్తోంది. స్వల్ప వ్యత్యాసంతో ఓడిపోతున్నాం. సొంతగడ్డపై ముంబై, కేకేఆర్‌లతో జరిగిన మ్యాచ్‌ల్లో నెగ్గాల్సి ఉంది, మరో 20 పరుగులు చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేది. తర్వాతి మ్యాచ్‌కు పాజిటివ్‌గానే ఉన్నాం. గెలిచేందుకు పోరాడతాం" అని డివిలియర్స్ చెప్పాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications