Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మై బ్రదర్..: డివిలియర్స్ రిటైర్మెంట్‌పై విరాట్ కోహ్లీ భావోద్వేగం

AB de Villiers retirement: Virat Kohlis brilliant wish for RCB teammate ABD on Twitter isnt to be missed

హైదరాబాద్: తన ఆటతీరుతో ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకున్న దక్షిణాఫ్రికా స్టార్ ప్లేయర్ ఏబీ డివిలియర్స్ అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించిన యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేశాడు. డివిలియర్స్ ఉన్నపళంగా అన్ని ఫార్మాట్ల నుంచి అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకడంతో క్రికెట్ లోకం ఒక్కసారిగా షాక్‌కి గురైంది.

డివిలియర్స్ రిటైర్‌మెంట్‌పై ఐసీసీ, బీసీసీఐ సహా పలువురు మాజీ క్రికెటర్లు, ప్రస్తుత క్రికెటర్లు డివిలియర్స్ రిటైర్‌మెంట్‌పై సోషల్ మీడియా వేదికగా ట్వీట్లు చేశారు. ఐపీఎల్‌లో డివిలియర్స్‌తో కలిసి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ప్రాతినిథ్యం వహించిన ఆ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ అతడి రిటైర్మెంట్‌పై ఏం స్పందిస్తాడని క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూశారు.

తాజాగా శనివారం డివిలియర్స్ రిటైర్మెంట్‌పై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ నిశ్శబ్దం వీడాడు. 'మై బ్రదర్.. నువ్వు చేసే ప్రతి పనిలో మంచి జరగాలని కోరుకుంటున్నా. క్రికెట్లో బ్యాటింగ్ చేసే విధానాన్నే మర్చేశావ్. నీకు నీ కుటుంబానికి నా అభినందనలు. జీవన ప్రయాణం అద్భుతంగా సాగాలని కోరుకుంటున్నా' అని ట్విట్టర్‌లో డివిలియర్స్ రిటర్మెంట్‌పై కోహ్లీ ఎమోషనల్‌ అయ్యాడు.

క్రికెట్‌లో ఏబీ డివిలియర్స్‌కు 'మిస్టర్ 360' అని పేరుంది. ఎలాంటి షాట్లునైనా అలవోకగా ఆడగలడన్న పేరుంది. అందుకే ఏబీని ముద్దుగా అభిమానులు మిస్టర్ 360 డిగ్రీస్ అని పిలుస్తారు. 34 ఏళ్ల ఏబీ డివిలియర్స్ మూడు ఫార్మాట్ల నుంచి తాను వైదొలగుతున్నట్లు బుధవారం తన ట్విట్టర్‌‌లో ఓ వీడియో సందేశాన్ని పోస్టు చేశాడు.

ఈ వీడియోలో డివిలియర్స్ 'తక్షణమే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకాలని నిర్ణయం తీసుకున్నా. 114 టెస్టు మ్యాచ్‌లు, 228 వన్డేలు, 78 టీ20లు ఆడాను. ఇతరులకు అవకాశం ఇచ్చే సమయం ఇది. ప్రస్తుతం నా వంతు వచ్చింది. నేను అలసిపోయానని నిజాయతీగా చెబుతున్నాను. నేను రిటైర్ అవుతున్నా' అని తెలిపాడు.

'ఇది చాలా కఠిన నిర్ణయం కానీ చాలా కాలంగా ఈ విషయంపై ఆలోచిస్తున్నాను. మంచి ఫామ్‌లో ఉన్నపుడే తప్పుకోవాలని అనుకున్నాను. కానీ నేను తప్పుకోవడానికి ఇదే సరైన సమయం. క్రికెట్ దక్షిణాకాకి, నా జట్టు సభ్యులకు, దక్షిణాఫ్రికా, ప్రపంప వ్యాప్తంగా నా వెనుక ఉండి నాకు మద్దతు తెలిపిన అభిమానులకు నా ధన్యవాదాలు' అని డివిలియర్స్ తెలిపాడు.

'ఇండియా, ఆస్ట్రేలియాలపై సిరీస్‌లు గెలిచిన తర్వాత రిటైర్మెంట్‌కు ఇదే సరైన సమయమని భావించాను. ఇక నా సహచక క్రికెటర్లకు ధన్యవాదాలు. ఎందుకంటే వాళ్ల మద్దతు లేకుండా నేను ఈ స్థాయికి వచ్చేవాడినే కాదు. ఇక నావల్ల కాదు అనిపించింది. నా నిర్ణయాన్ని అర్థం చేసుకునే అభిమానులకు కృతజ్ఞతలు. విదేశాల్లో ఆడే ఆలోచన కూడా నాకు లేదు. అయితే దేశీయంగా టైటాన్స్ టీమ్‌కు మాత్రం ఆడతాను' అని డివిలియర్స్ తెలిపాడు.

2004 డిసెంబర్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌తో డివిలియర్స్ అంతర్జాతీయ క్రికెట్‌లో ఆరంగేట్రం చేశాడు. తన సుదీర్ఘ క్రికెట్ కెరీర్‌లో 114 టెస్టులు, 228 వన్డేలు, 78 టీ20లు, 141 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన డివిలియర్స్ మొత్తం 50 సెంచరీలు, 137 హాఫ్ సెంచరీలు, 2 డబుల్ సెంచరీలు సాధించాడు.

Story first published: Saturday, May 26, 2018, 15:43 [IST]
Other articles published on May 26, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+