డివిలియర్స్ స్విచ్ షాట్‌కు ఆశ్చర్యపోయిన అభిమాని (వీడియో)

హైదరాబాద్: అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు ప్రకటించినప్పటికీ... దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ అభిమానులను అలరిస్తూనే ఉన్నాడు. మిస్టర్ 360గా పేరుగాంచిన ఏబీ డివిలియర్స్ ఆ దేశంలో జరుగుతున్న మాన్షి సూపర్ లీగ్‌లో ష్వానే స్పార్టాన్స్ జట్టుకు ప్రాతనిథ్యం వహిస్తున్నాడు.
టోర్నీలో భాగంగా ఆదివారం కేప్‌టౌన్ బ్లిట్జ్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఏబీ హాఫ్ సెంచరీలో అలరించాడు. తనదైన షాట్లతో అలరించాడు. ఈ మ్యాచ్‌లో ఏబీ డివిలియర్స్ 30 బంతుల్లో 59 పరుగులు చేశాడు. అయితే స్పార్టాన్స్ ఇన్నింగ్స్ 11వ ఓవర్‌లో ఏబీ డివిలియర్స్ బాదిన స్విచ్ షాట్ అభిమానులను అలరించింది.
స్విచ్ షాట్‌తో సిక్స్ బాదిన డివిలియర్స్
స్పిన్ బౌలింగ్‌ను చీల్చిచెండాడే ఏబీ డివిలియర్స్ కేప్‌టౌన్ బ్లిట్జ్ స్పిన్నర్ వేసిన ఓ బంతిని స్విచ్ షాట్‌తో అమాంతం స్టాండ్స్‌లోకి తరలించాడు. ఈ బంతి నేరుగా వెళ్లి మ్యాచ్ వీక్షిస్తోన్న అభిమాని చేతుల్లోకి వెళ్లడంతో అతడు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

181 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన స్పార్టాన్స్
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కేప్ టౌన్ బ్లిట్జ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసింది. కేప్ టౌన్ బ్లిట్జ్ జట్టులో కైలీ వెర్రెయన్నీ(53), మహమ్మద్ నవాజ్(59) హాఫ్ సెంచరీలతో రాణించారు. అనంతరం 181 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ష్వానే స్పార్టాన్స్ జట్టులో డివిలియర్స్ హాఫ్ సెంచరీతో రాణించిన జట్టుని ఓటమి నుంచి తప్పించలేకపోయాడు.

49 పరుగుల తేడాతో ఓటమి పాలైన ష్వానే స్పార్టాన్స్
ఈ మ్యాచ్‌లో ష్వానే స్పార్టాన్స్ జట్టు 49 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ ఏడాది మొదట్లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఏబీ డివిలియర్స్ ఇండియన్స్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications