Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బుడ్డోడికి ఆర్సీబీ లెజెండ్ బిగ్ ఛాలెంజ్!

భారత క్రికెట్లో ప్రస్తుతం సెన్సేషన్‌గా మారిన 15 ఏళ్ల యువ కెరటం వైభవ్ సూర్యవంశీ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఐపీఎల్ 2025లో రాజస్థాన్ రాయల్స్ తరఫున అరంగేట్రం చేసినప్పటి నుంచి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి దిగ్గజాల మధ్య కూడా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అద్భుతమైన హిట్టింగ్ సామర్థ్యం ఉన్న వైభవ్ ప్రతిభను మైఖేల్ వాన్, అలిస్టర్ కుక్ వంటి మాజీలు కొనియాడారు. త్వరలోనే వైభవ్ భారత సీనియర్ జట్టులోకి వస్తాడని అంతా భావిస్తున్నారు.

అయితే ఆర్సీబీ లెజెండ్ ఏబీ డివిలియర్స్ మాత్రం వైభవ్ సూర్యవంశీ భవిష్యత్తుపై భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. స్టువర్ట్ బ్రాడ్, జోస్ బట్లర్ నిర్వహించిన 'ఫర్ ది లవ్ ఆఫ్ క్రికెట్' పాడ్‌కాస్ట్‌లో ఏబీ డివిలియర్స్ మాట్లాడుతూ.. వైభవ్ సూర్యవంశీ కెరీర్ సుదీర్ఘంగా సాగాలంటే అతను కేవలం టీ20లకు మాత్రమే పరిమితం కాకూడదని సూచించారు. "వైభవ్‌లో అద్భుతమైన ప్రతిభ ఉంది, కానీ అతను ఎక్కువ కాలం రాణించగలడా? అనే దానిపై నాకు అనుమానం ఉంది" అని ఏబీ డివిలియర్స్ స్పష్టం చేశాడు.

AB de Villiers Issues Open Challenge to Vaibhav Sooryavanshi Says Prove Yourself in Test Cricket

ఏబీడీ దృష్టిలో టీ20 క్రికెట్, టెస్ట్ క్రికెట్ మధ్య చాలా తేడా ఉంటుంది. వైభవ్ సూర్యవంశీ తనను తాను కేవలం టీ20 స్పెషలిస్ట్‌గా మార్చుకుంటే అతని కెరీర్ విజయవంతంగా సాగుతుందని.. కానీ వన్డేలు, టెస్టుల్లోకి అడుగుపెడితే మాత్రం కఠినమైన సవాళ్లు ఎదురవుతాయని హెచ్చరించాడు. టెస్ట్ క్రికెట్‌లో మానసిక, శారీరక దృఢత్వం చాలా అవసరమని.. అక్కడ ఎదురయ్యే అడ్డంకులను అధిగమించడం అంత సులభం కాదని ఆయన అభిప్రాయపడ్డాడు.

"వైభవ్‌ సూర్యవంశీకి అన్ని రకాల షాట్లు ఆడే సత్తా ఉంది, కానీ టెస్ట్ క్రికెట్ ఆడేటప్పుడు అతను తనలోని కొత్త కోణాన్ని కనుగొనాల్సి ఉంటుంది. అది ఒక గంభీరమైన ప్రయాణం లాంటిది. అతను ఆ సవాళ్లను దాటుకుని తన దేశం తరపున టెస్టులు ఆడాలని నేను కోరుకుంటున్నాను" అని డివిలియర్స్ ముగించాడు. మరి ఈ 15 ఏళ్ల వండర్ కిడ్, ఏబీడీ విసిరిన ఈ సవాల్‌ను స్వీకరించి భవిష్యత్తులో అన్ని ఫార్మాట్లలో రాణిస్తాడో లేదో వేచి చూడాలి.

Story first published: Wednesday, May 13, 2026, 17:01 [IST]
Other articles published on May 13, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+