మొహాలి: అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో బ్యాటింగ్ లెజెండ్ సచిన్ టెండూల్కర్‌తో పోలిస్తే ఏబీ డివిలియర్స్ అత్యుత్తమ ఆటగాడంటూ దక్షిణాఫ్రికా మాజీ ఫాస్ట్ బౌలర్ ఫానీ డివిలియర్స్ అభిప్రాయపడ్డాడు.
51 ఏళ్ల ఫానీ డివిలియర్స్ సోమవారం 'ద టైమ్స్ ఆఫ్ ఇండియా'కి ఇచ్చిన ఇంటర్యూలో వరల్డ్ క్రికెట్‌లో సచిన్ టెండూల్కర్ కంటే ఏబీ డివిలియర్స్ బాగా ప్రాచుర్యం పొందుతున్నాడని తెలిపారు. 'ఏబీ డివిలియర్స్ గురించి ఒక మాట చెప్పనా? వరల్డ్ క్రికెట్‌లో సచిన్‌తో పోలిస్తే ఏబీ డివిలియర్స్ బాగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటున్నాడు' అని అన్నారు.
దక్షిణాఫ్రికా తరుపున 18 టెస్టులు, 83 వన్డే మ్యాచ్‌లాడిన ఫానీ డివిలియర్స్ మాట్లాడుతూ 'సచిన్ టెండూల్కర్‌తో ఏబీ డివిలియర్స్ సాధించిన రికార్డులను పరిశీలించండి. వన్డేల్లో టెండూల్కర్ కంటే ఏబీ డివిలియర్స్ ప్రదర్శన అత్యుత్తమం. ప్రవర్తనలో సైతం సచిన్ టెండూల్కర్‌లాగే అతని ధోరణి ఉంటుంది' అని తెలిపారు.

'టాటూలు ఉండవు. చెవులకు రింగులు ఉండవు. ఫ్యాషన్‌ను చూపించేలా అతని ప్రవర్తన ఉండదు' అని తెలిపారు. వరల్డ్ క్రికెట్‌లో ఏబీ డివిలియర్స్ నెంబర్ వన్ బ్యాట్స్‌మెన్‌గా కొనసాగుతున్నాడు. ప్రస్తుతం ఏబీ డివిలియర్స్ 17వేల పరుగులతో వన్డేల్లో 23, టెస్టుల్లో 21 సెంచరీలు సాధించాడు.
దక్షిణాఫ్రికా వన్డే జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న 31 ఏళ్ల ఏబీ డివిలియర్స్ ఇటీవలే భారత్‌పై 3-2 తేడాతో దక్షిణాఫ్రికా వన్డే సిరిస్‌ను గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. ఐదు మ్యాచ్ టోర్నీలో మూడు సెంచరీలు సాధించి, అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. అంతేకాదు 358 పరుగులతో సిరిస్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
నాలుగు వన్డేల టెస్టు సిరిస్‌లో భాగంగా నవంబర్ 5(గురువారం) నుంచి మొహాలిలో జరగనున్న తొలి వన్డే మ్యాచ్ సన్నాహాకాల్లో బిజీగా ఉన్నాడు.