Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వైరల్ ఫీవర్ తగ్గింది: చెన్నై మ్యాచ్‌కి డివిలియర్స్ సిద్ధం

AB

హైదరాబాద్: చెన్నై సూపర్‌ కింగ్స్‌తో పూణె వేదికగా శనివారం జరిగే మ్యాచ్‌కు ఏబీ డివిలియర్స్‌ అందుబాటులో ఉంటాడని బెంగళూరు ప్రధాన కోచ్‌ డానియల్‌ వెటోరి తెలిపాడు. ఇక, జట్టులోని క్వింటన్‌ డికాక్‌ స్వదేశానికి వెళ్లడంతో మ్యాచ్‌కు అందుబాటులో ఉండడని వెల్లడించాడు.

స్వదేశంలో జరిగే ఓ వివాహానికి హాజరు కావడానికి అతను దక్షిణాఫ్రికా వెళ్లనున్నట్లు వెటోరి వెల్లడించాడు. వైరల్‌ ఫీవర్ కారణంగా గత రెండు మ్యాచ్‌ల్లో ఏబీ డివిలియర్స్ తుది జట్టులో లేని సంగతి తెలిసిందే. 'ఏబీ ఫిట్‌గా ఉన్నాడు. ఓ పెళ్లికి హాజరయ్యేందుకు స్వదేశానికి పయనం కావడంతో డికాక్‌ అందుబాటులో ఉండటం లేదు' అని వెటోరీ తెలిపాడు.

ఇక, ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఆల్‌రౌండర్‌ కొలిన్‌ డి గ్రాండ్‌హోమ్‌ ఫినిషింగ్‌ అద్భుతమని వెటోరి కొనియాడాడు. 'చివరి మ్యాచ్‌లో కొలిన్‌ చక్కగా ఆడాడు. చివర్లో అతడు సాధించిన 20 పరుగులే మా విజయానికి ఓ కారణం. అతడి ఆట పట్ల సంతృప్తిగా ఉన్నా' అని అన్నాడు.

1
43445

'మన్‌దీప్‌ సింగ్‌ సైతం నిలకడగా రాణిస్తున్నాడు. టాపార్డర్ రాణించనప్పుడు మ్యాచ్‌ను ముగించడంలో మిడిలార్డర్‌ పాత్రే కీలకం. ప్రస్తుతానికి మా బౌలింగ్‌ విభాగం కుదురుకుందని భావిస్తున్నా. ముంబై మ్యాచ్‌లో సౌథీ అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. సిరాజ్‌ మెరుగయ్యాడు. చాహల్‌, ఉమేశ్‌ యథావిథిగా కట్టుదిట్టంగా బంతులు వేశారు' అని వెటోరీ వివరించాడు.

ఐపీఎల్ టోర్నీలో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తన తదుపరి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ శనివారం సాయంత్రం 4 గంటలకు పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ ఆసోసియేషన్ స్టేడియంలో జరగనుంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు బెంగళూరు ఆడిన ఎనిమిది మ్యాచ్‌ల్లో మూడింట విజయం సాధించి పాయింట్ల పట్టికలో ఆఖరి నుంచి మూడో స్థానంలో కొనసాగుతోంది.

Story first published: Saturday, May 5, 2018, 9:51 [IST]
Other articles published on May 5, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+