
మూడుసార్లు ఫైనల్స్‌కు..
ట్రోఫీ నెగ్గలేదు కదా అని ఆర్సీబీని తక్కువ అంచనా వేయకూడదు. ఈ టోర్నీలో మూడు సీజన్లలో అద్భుతమైన ఆటతీరుతో ఫైనల్ చేరిందా జట్టు. 2009, 2011, 2016 మూడు ఐపీఎల్ సీజన్లలో ఫైనల్‌కు దూసుకెళ్లింది. కానీ చివరి అడుగు వెయ్యలేక చతికిలపడింది. విరాట్ కోహ్లీ, ఏబీ డివిల్లీర్స్ అద్భుతంగా రాణించడంతో 2016లో కచ్చితంగా కప్పు కొడుతుందని అంతా అనుకున్నారు. కానీ చివర్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓటమి చవిచూసి రన్నరప్ టైటిల్‌తో సరిపెట్టుకుంది. గతేడాది కూడా నాకౌట్ చేరుకున్న ఆర్సీబీ.. రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓటమిపాలై ఫైనల్‌లో అడుగు పెట్టలేకపోయింది.

మొదటిదే కష్టం..
ఐపీఎల్‌లో ఆర్సీబీకి మొదటి టైటిల్ రావడమే కష్టమని, ఆ తర్వాతి టైటిల్స్ సులభంగా గెలుస్తుందని ఆ జట్టు మాజీ ప్లేయర్ ఏబీ డివిల్లీర్స్ అన్నాడు. 'ఇప్పటికి ఎన్ని సీజన్లు అయ్యాయి? 14-15 కదా. ఈ శృంఖలాలు తెంచుకోవడానికి వాళ్లు చాలా ఇష్టపడతారు. ఆర్సీబీ కనుక ఒక్క టైటిల్ గెలిస్తే.. ఆ తర్వాత రెండు, మూడు, నాలుగు చాలా వేగంగా గెలుస్తారని నేను నమ్ముతున్నా. కానీ ఇప్పుడే ఏం చెప్పలేం కదా. టీ20 క్రికెట్ అంటేనే గ్యాంబిల్ వంటిది. ముఖ్యంగా నాకౌట్ గేమ్స్‌లో ఏమైనా జరగొచ్చు. కానీ త్వరలోనే ఆర్సీబీ కూడా టైటిల్ కొడుతుందని ఆశిస్తున్నా' అని డివిల్లీర్స్ చెప్పాడు.

వచ్చే ఏడాది మళ్లీ ఆర్సీబీలోకి..
గతేడాది అన్ని క్రికెట్ ఫార్మాట్లకూ ఈ సౌతాఫ్రికా లెజెండ్ వీడ్కోలు పలికాడు. ఐపీఎల్ కూడా ఆడలేదు. మిస్టర్ 360 అని అభిమానులు ప్రేమగా పిలుచుకునే ఈ లెజెండరీ బ్యాటర్.. మొత్తం 187 ఐపీఎల్ మ్యాచుల్లో 39.71 సగటుతో ఏకంగా 5162 పరుగులు చేశాడు. 2023లో మళ్లీ ఆర్సీబీ కుటుంబంతో కలుస్తానని ముందే చెప్పిన ఏబీ డివిల్లీర్స్.. జట్టులో ఏ పాత్ర పోషిస్తాడో తెలియడం లేదు. కోచ్‌గా వస్తాడా? లేక మెంటార్‌గా వస్తాడా? చూడాలి. ఇలా డివిల్లీర్స్ పునరాగమనంతో అయినా ఆర్సీబీ రాత మారుతుందేమో చూడాలి.


Click it and Unblock the Notifications












