For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టెస్టు క్రికెట్ చరిత్రలో రికార్డు సృష్టించిన డుప్లెసిస్

By Nageswara Rao

న్యూఢిల్లీ: టెస్టు క్రికెట్ చరిత్రలో తొలి పరుగుని సాధించేందుకు అత్యధిక బంతులను ఎదుర్కొన్న ఆటగాడిగా దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ డుప్లెసిస్ సరికొత్త రికార్డుని సృష్టించాడు. ప్రీడమ్ సిరిస్‌లో భాగంగా భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న ఐదో టెస్టు మ్యాచ్‌లో ఈ అరుదైన రికార్డుని అందుకున్నాడు.

న్యూఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానంలో జరుగుతున్న ఐదో టెస్టు మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా కెప్టెన్ ఆమ్లా 25 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటైన అనంతరం క్రీజులోకి వచ్చిన డుప్లెసిస్ తొలి పరుగు చేసేందుకు 53 బంతులను తీసుకున్నాడు.

నాల్గవ రోజు ఆటలో భాగంగా తొలి పరుగు చేసేందుకు కెప్టెన్ ఆమ్లా 45 బంతులాడిన సంగతి తెలిసిందే. ఈ రికార్డు అంతకముందు న్యూజిలాండ్‌కు చెందిన ఎక్‌స్టీన్ పేరిట ఉంది. టెస్టు క్రికెట్ చరిత్రలోనే ఓ ఇన్నింగ్స్‌లో తొలి పరుగు చేయడానికి గాను ఎక్‌స్టీన్ 46 బంతులను ఎదుర్కోవాల్సి వచ్చింది.

ఇప్పుడిక ఈ రికార్డుని డుప్లెసిస్ కైవసం చేసుకున్నాడు. ఢిల్లీ టెస్టును డ్రాగా ముగించేందుకు దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్లు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. లంచ్ విరామ సమయానికి దక్షిణాఫ్రికా 3 వికెట్లను నష్టపోయి 94 పరుగులు చేసింది.

AB de Villiers, Faf du Plessis Help Proteas to Survive to 94/3 at Lunch

Lowest strike rate in Test innings (minimum 200 balls) - Top 5

1. Hashim Amla (South Africa) - 25 off 244 balls (Strike rate 10.24) Vs India in Delhi (2015)
2. Jack Russell (England) - 29 not out off 235 balls (12.34) Vs South Africa in Johannesburg (1995)
3. Chris Tavare (England) - 35 off 240 balls (14.58) Vs India in Chennai (1982)
4. AB de Villiers (South Africa) - 33 off 220 balls (15.00) Vs Australia in Adelaide (2012)
5. Younis Ahmed (Pakistan) - 34 not out off 226 balls (15.04) Vs India in Ahmedabad (1987)

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+