వెళ్లొస్తా.. నేస్తం!, మళ్లీ ఐపీఎల్‌లో కలుద్దాం..

హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, సౌతాఫ్రికా స్టార్ ఆటగాడు ఏబీ డివిలియర్స్ మధ్య అనుబంధం మరోసారి కెమెరా కంట పడింది. ఐపీఎల్ జట్టు సహచర ఆటగాడైన డివిలియర్స్‌ని మ్యాచ్ అనంతరం కోహ్లీ మనస్పూర్తిగా అభినందించాడు. హృదయానికి హత్తుకుని మళ్లీ ఐపీఎల్ లో కలుద్దామని చెప్పి వీడ్కోలు తీసుకున్నాడు.
ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ సహచరులైన వీరిద్దరి మధ్య చక్కటి అవగాహన ఉంది. మంచి మిత్రులుగా కలిసి సాగుతారు. ఎప్పుడు కనిపించినా సోదరభావంతో మెలుగుతారు. ఒకరు బాగా ఆడితే మరొకరు ప్రశంసిస్తారు. దక్షిణాఫ్రికాతో జరిగిన ఆరో వన్డేలో విజయానంతరం ఈ విషయం మరోసారి వెల్లడైంది.
గత భారత పర్యటనలో వన్డే సిరీస్‌లో డివిలియర్స్ 3 సెంచరీలు సాధిస్తే.. ప్రస్తుత సఫారీ పర్యటనలో కోహ్లి కూడా మూడు సెంచరీలతో డివిలియర్స్ లెక్క సరిచేశాడు.
అజేయ శతకంతో ఆరో వన్డేను కోహ్లి (129)తో గెలిపించాక డివిలియర్స్.. విరాట్ దగ్గరకు వచ్చి హత్తుకుని కంగ్రాట్స్ చెప్పాడు. 5-1 తేడాతో సిరీస్ విజయంలో కీలక పాత్ర పోషించిన ప్రియ మిత్రుణ్ని అభినందించాడు. ఈ దృశ్యం క్రికెట్ అభిమానులను మనసుకు హత్తుకుంది. డివిలియర్స్ క్రీడా స్ఫూర్తిని ప్రదర్శిస్తాడు కాబట్టే.. అతడు ఆడుతుంటే భారత అభిమానులు కూడా తమ వాడిగానే భావించి ఉత్సాహపరుస్తారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications