అరుదైన ఘనత: గంగూలీ రికార్డుని బద్దలు కొట్టిన డివిలియర్స్
హైదరాబాద్: దక్షిణాఫ్రికా డ్యాషింగ్ బ్యాట్స్ మెన్, ఆ జట్టు కెప్టెన్ ఏబీ డివిలియర్స్ మరో ఆరుదైన రికార్డుని సృష్టించాడు. వన్డే క్రికెట్ చరిత్రలో అతి తక్కువ మ్యాచ్‌లు, ఇన్నింగ్స్‌లలో 9000 పరుగుల మైలురాయిని చేరుకున్న ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.
మొత్తం 205 ఇన్నింగ్స్‌లలో డివిలియర్స్ ఈ ఘనతను సాధించాడు. ఇప్పటివరకు ఈ రికార్డు టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ పేరిట ఉంది. 228 ఇన్నింగ్స్‌లలో సౌరభ్ గంగూలీ 9000 పరుగుల మైలురాయిని అందుకున్నాడు.
2004లో మెల్ బోర్న్‌లో ఆస్ట్రేలియాపై గంగూలీ ఈ రికార్డుని నెలకొల్పాడు. అయితే తాజాగా గంగూలీ పేరిట ఉన్న ఈ రికార్డును డివిలియర్స్ అధిగమించాడు. మొత్తంగా చూస్తే వన్డే క్రికెట్‌లో 18 మంది ఈ ఘనతను సాధించారు. అయితే వీరిలో అత్యుత్తమ స్ట్రయిక్ రేట్ 99.94తో డివిలియర్స్ మొదటి స్ధానంలో ఉన్నాడు.

న్యూజిలాండ్ పర్యటనలో ఈ ఘనత
న్యూజిలాండ్ పర్యటన సందర్భంగా మూడో వన్డేలో డివిలియర్స్ ఈ రికార్డును నెలకొల్పాడు. ఈ మ్యాచ్‌లో 5 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ప్టెన్ డివిలియర్స్ తొమ్మిది వేల వన్డే పరుగులు పూర్తి చేసుకుని గంగూలీ రికార్డును అధిగమించాడు.

87 పరుగుల దూరంలో
న్యూజిలాండ్ పర్యటనకు రాకముందు ఈ అరుదైన ఘనతకు కేవలం 87 పరుగుల దూరంలో ఉన్న డివిలియర్స్ తొలి రెండు వన్డేల్లో వరుసగా 37 పరుగులు నాటౌట్, 45 పరుగులు చేశాడు. తొమ్మిది వేల పరుగుల మైలురాయికి అవసరమైన ఐదు పరుగులను ఈ వన్డేలో సాధించాడు.

జాక్వస్ కలిస్ పేరిట ఉన్న రికార్డుని సవరించాడు
వన్డేల్లో దక్షిణాఫ్రికా కెప్టెన్ ఏబీ డివిలియర్స్ తన పేరిట ఎన్నో రికార్డులను సృష్టించాడు. దక్షిణాఫ్రికా జట్టు నుంచి గతంలో జాక్వస్ కలిస్ (242 ఇన్నింగ్స్‌లు) పేరిట ఉన్న రికార్డును డివిలియర్స్ (205 ఇన్నింగ్స్ లు) సవరించాడు.

ద్రవిడ్ రికార్డును అందుకోలేని డివిలియర్స్
మరోవైపు గంగూలీ రికార్డును అధిగమించిన డివిలియర్స్, 'ద వాల్' రాహుల్ ద్రవిడ్ రికార్డును మాత్రం అందుకోలేకపోయాడు. వన్డేలు ఆడటం ప్రారంభించిన తర్వాత 9 ఏళ్ల 322 రోజుల్లో రాహుల్ ద్రవిడ్ 9000 పరుగులను సాధించాడు. కానీ, డివిలియర్స్‌కు ఈ ఘనత సాధించడానికి 12 ఏళ్ల 23 రోజులు పట్టింది.
| ప్లేయర్ | ప్రత్యర్ధి | మ్యాచ్‌లు | ఇన్నింగ్స్ |
| ఏబీ డివిలియర్స్ | న్యూజిలాండ్ | 214 | 205 |
| సౌరభ్ గంగూలీ | ఆస్ట్రేలియా | 236 | 228 |
| సచిన్ టెండూల్కర్ | దక్షిణాఫ్రికా | 242 | 235 |
| బ్రియాన్ లారా | ఆస్ట్రేలియా | 246 | 239 |
| రికీ పాంటింగ్ | దక్షిణాఫ్రికా | 248 | 242 |
| జాక్వస్ కలిస్ | ఇంగ్లాండ్ | 256 | 242 |
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications